మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారానికి తెలపడింది.ఇప్పుడు పోలింగ్ పైనే అందరూ దృష్టి సారించారు.
పోలింగ్ కు ఇంకా కొన్ని గంటల సమయం ఉండడంతో, ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే విషయం పై పార్టీలు టెన్షన్ పడుతున్నాయి.మునుగోడు ఓటర్ల దృష్టిలో పడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి.
మరోవైపు ఓటర్లకు తాయిలాలు పంచేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.ఇక ఒక పార్టీని ఇరికించేందుకు మరొక పార్టీ ప్రయత్నాలు చేస్తున్నాయి.
మునుగోడులో ధన ప్రవాహం లేకుండా చేసేందుకు , ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చూసేందుకు ఎన్నికల కమిషన్ సైతం పగడ్బందీ గానే ఏర్పాట్లు చేసింది.
ఇక చెక్ పోస్టుల వద్ద భారీగా సొమ్ములు పట్టుబడుతున్నాయి.
ఇవి ఏ పార్టీకి చెందినవి అనే దానిపైన విచారణలు జరుగుతున్నాయి.ఇవన్నీ ఇలా ఉంటే …రేపు జరగబోయే పోలింగ్ లో ఓటర్లు ఎటువైపు ఉంటారనే టెన్షన్ ప్రధాన పార్టీల్లో నెలకొంది.
దీనికి తోడు స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా పోటీ చేస్తుండడంతో, వీరికి అనేక గుర్తులను ఎన్నికల కమిషన్ కేటాయించింది.అయితే కొన్ని గుర్తులు ప్రధాన పార్టీల గుర్తులను పోలి ఉండడంతో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని తమ పార్టీకి వేయాల్సిన ఓటు స్వతంత్ర అభ్యర్థులకు వెళుతుందేమో అన్న టెన్షన్ అన్ని పార్టీల్లోనూ నెలకొంది.
అందుకే పదే పదే తమ ఎన్నికల గుర్తును ఓటర్లకు ముందు నుంచే చూపిస్తూ.తమ ఎన్నికల గుర్తును పోలి ఉండే స్వతంత్ర అభ్యర్థుల గుర్తుకు ఓటు వేయకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ అయితే మరీ టెన్షన్ పడుతోంది.టిఆర్ఎస్ కారు గుర్తును పోలి ఉండే రోడ్డు రోలర్ గుర్తు కూడా మరో అభ్యర్థికి కేటాయించడంతో, నెంబర్ పైనే ఓటు వేయాలని టిఆర్ఎస్ కోరుతోంది.రోడ్డు రోలర్ , బోట , చపాతీ, రోలర్ వంటి గుర్తులు కారు గుర్తును పోలి ఉండడంతో టిఆర్ఎస్ ఇంతగా ఆందోళన చెందుతోంది.ఇదే మాదిరిగా కొన్ని నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి చెందడానికి కారణం కావడంతో, ఈసారి అలా జరగకుండా ఓటర్లకు ఎన్నికల గుర్తుతో పాటు నెంబర్ ను చూపిస్తూ.
దానికి ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పదేపదే కోరింది.సాధారణంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో గుర్తుని బట్టి ఓటు వేస్తారు.అభ్యర్థి పేరును చదివేందుకు అవకాశం లేకపోవడంతో గుర్తులే కీలకం అవుతాయి.అయితే ఈ గుర్తులు కారణంగా తమ ఓట్లు వేరొకరికి వెళ్తాయనే టెన్షన్ టిఆర్ఎస్ తో పాటు, మిగతా ప్రధాన పార్టీలకు ఆందోళన కలిగిస్తున్నాయి.