సినిమాల్లో స్టార్ హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలు రియల్ లైఫ్ లో కూడా స్టార్ హీరోలుగా చలామణి అవుతారా అనే ప్రశ్నకు కాదనే జవాబు వినిపిస్తుంది.అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సినిమాలతో పాటు రియల్ లైఫ్ లో కూడా స్టార్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.
కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలకు తారక్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే.
వర్షం పడటం వల్ల ఈ సభలో ఏర్పాటు చేసిన కుర్చీలు అన్నీ తడిశాయి.
ఆ కుర్చీలలో ఒక కుర్చీని తారక్ బట్టతో తుడిచి మొదట పునీత్ బార్య అశ్వినీని తారక్ ఆ కుర్చీలో కూర్చోవాలని సూచించారు.ఆ తర్వాత మరో కుర్చీలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధామూర్తిని కూర్చోవాలని తారక్ సూచనలు చేశారు.
మహిళలను తారక్ గౌరవించిన తీరుకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

ఈ విజువల్స్ ను చూసిన వాళ్లు తారక్ గ్రేట్ నెస్ ను మెచ్చుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు అరుదుగా ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.తారక్ గ్రేట్ హీరో అని మరి కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
మరోవైపు తారక్ కొత్త సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఈ నెలాఖరు నుంచి మొదలుకానున్నాయనే సంగతి తెలిసిందే.కొరటాల శివ ఈ సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.
కొరటాల శివకు ఆచార్య సినిమా ఫలితం భారీ షాకివ్వగా కొరటాల శివ సినీ కెరీర్ ఈ సినిమాపైనే ఆధారపడి ఉందని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త కథలు కూడా వింటున్నారని తెలుస్తోంది.







