SUV Cars : టాప్ SUV కార్లను ఇపుడు రూ.10 లక్షల కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోండి!

నేటి యువత కార్లంటే విపరీతమైన మోజుతో వున్నారు.అయితే కార్లనేవి కొనడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు.

 Suv Cars Under 10 Lakh In India-TeluguStop.com

అయితే కొన్ని రకాల బడ్జెట్ కార్లను కొనడం మాత్రం చాలా తేలిక.ఈ క్రమంలోనే మార్కెట్లో కాంపాక్ట్ SUV కార్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.

టాప్ ఫీచర్లతో అందుబాటు ధరలో ఇవి నేడు లభిస్తున్నాయి.మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి పలు ఇతర కంపెనీలు రూ.10 లక్షల ధరలోపే SUVలను అందివ్వడం కొసమెరుపు.మీరు కూడా ఈ ధరలోపు కొత్త SUV కొనుగోలు చేయాలని అనుకుంటే, ఇవి ట్రై చేస్తే మంచింది.
మారుతి S-Presso VXI CNG మోడల్‌ను అందిస్తోంది.దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.9 లక్షల నుంచి ఆరంభం అవుతోంది.కాగా ఇది 2 వేరియంట్లలో దొరుకుతుంది.అలాగే హ్యుందాయ్ నుంచి వెన్యూ కారు మంచి ఆప్షన్.ఇది 7 కలర్ ఆప్షన్లలో మీకు లభిస్తోంది.ఈ మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.7.53 నుంచి స్టార్ట్ అవుతోంది.అలాగే Kia సొన్నెట్ కారు కూడా ఓ మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభం ధర రూ.7.17 లక్షలుగా వుంది.ఇందులో సైడ్ ఎయిర్ బ్యాగ్స్, హైలైన్ టైర్ ప్రెజన్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలోనూ స్టాండర్డ్ ఫీచర్లుగా ఉన్నాయి.

Telugu India, Kia Cars, Kia Sonet Car, Latest, Suv Car, Suv Cars, Suv Cars India

అలాగే మారుతీ సుజుకీ నుంచి వితారా బ్రెజా అనేది ఇపుడు బాగా సేల్ అవుతోంది.ఈ కారు ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.7.99 లక్షలు మాత్రమే.ఈ SUVలో అనేక రకాల ఫీచర్లు ఉన్నాయి.

కలర్డ్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే స్క్రీన్, రియర్ ఏసీ వెంట్, ఆటో హెడ్‌ల్యాంప్స్, రియర్ ఫాస్ట్ చార్జింగ్, కూల్డ్ గ్లూవ్ బాక్స్, USB పోర్ట్స్ వంటి ప్రత్యేకతలు ఈ కారులో ఉండటం విశేషం. రూ.10 లక్షలలోపు బడ్జెట్‌లో కారు కొనాలని భావించే వారు ఈ మోడల్స్ ని పరిశీలిస్తే మీకు మంచి అనుభవం మిగులుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube