బుల్లితెరపై మల్లెమాలవారు ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈటీవీలో గత కొన్ని సంవత్సరాల నుంచి సుమ వ్యాఖ్యత వ్యవహరిస్తున్నటువంటి క్యాష్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సుమ వ్యాఖ్యాతగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపిస్తూ ఉన్నారు.సుమ ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఆహ్వానించి వారితో పెద్ద ఎత్తున టాస్కులను నిర్వహిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.
ఇక ఈ కార్యక్రమంలో గెలిచిన వారికి భారీ ప్రైజ్ మనీ ఉంటుందనే విషయాన్ని కూడా సుమ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటుంది.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఓ రౌండ్ లో కాలేజీ విద్యార్థులను ఆహ్వానించి వారి పై కూడా సుమ పంచులు వేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు.
అయితే తాజాగా క్యాష్ కార్యక్రమం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ కార్యక్రమంలో చూపించే వాటిలో దాదాపు అన్ని నిజం కాదనే వార్త వైరల్ అవుతుంది.
ఈ కార్యక్రమానికి వచ్చి ప్రైజ్ మనీ గెల్చుకున్న వారికి నిజంగా అంత డబ్బు ఇవ్వరని కేవలం ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి పేమెంట్ మాత్రమే ఇస్తారని తెలుస్తుంది.

ఇక సినిమా ప్రమోషన్ల కోసం ఈ కార్యక్రమానికి వచ్చే సెలబ్రిటీలు వారే మల్లెమాల వరకు డబ్బు చెల్లించి వస్తారని సమాచారం.ఇక ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులుగా సందడి చేసే వారంతా నిజంగానే కాలేజీ విద్యార్థులు కాదని వాళ్ళందరూ కూడా జూనియర్ ఆర్టిస్టులేనని తెలుస్తోంది.ఈ రౌండ్లో సుమ కొంతమందిని మాత్రమే కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అయితే ఈ షో ప్రారంభానికి ముందు స్క్రిప్ట్ ఇచ్చి వారిని సిద్ధం చేస్తుంటారనే వార్త వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ అంటే మల్లెమాలవారు ఇన్ని రోజులు ప్రేక్షకులను ఇంత మోసం చేస్తూ వచ్చారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.







