కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర తెలంగాణలో జరుగుతుంది.పాదయాత్రలో భాగంగా రైతులతో సమావేశమైన రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు.ఈ ధరణి పోర్టు వాళ్ల చాలామంది రైతులు తమ భూములను కోల్పోయారని ఆరోపించారు.
ఇదే సమయంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.కౌలు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ తెలియజేశారు.
తెలంగాణలో రాహుల్ పాదయాత్రకి మహిళలు మరియు యువకులు నుండి భారీ ఎత్తున ఆదరణ లభిస్తూ ఉంది.కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపు 3 వేల కిలోమీటర్లకు పైగా జరగనున్న ఈ పాదయాత్రలో చాలామంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఇదే సమయంలో పాదయాత్రలో రాహుల్ ఇస్తున్న హామీలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.దక్షిణాదిలో ఇప్పటికే ఏపీ మరియు కేరళ పలు రాష్ట్రాలలో రాహుల్ పాదయాత్ర చేయడం జరిగింది.
ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఈ పాదయాత్ర వచ్చే నెల 7 వరకు సాగనుంది.