నిర్మాణ రంగంలో భారత్ కొత్త పుంతలు తొక్కుతోంది.ఈ నేపథ్యంలోనే సముద్రంపై అవసరమైన సమయంలో పైకి లేచే విధంగా ఓ రైల్వే బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురానుంది.
దీనిని వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా రైల్వే మంత్రిత్వ శాఖ పిలుస్తోంది.దేశంలోనే తొలి దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా ఈ నూతన బ్రిడ్జి నిర్మాణం అవుతోందని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మితమవుతున్న ఈ బ్రిడ్జికి న్యూ పంబస్ బ్రిడ్జిగా నామకరణం చేసింది.సుమారు 63 మీటర్ల పొడవుతో సముద్రంపై ఈ బ్రిడ్జి నిర్మితమవుతోందని తెలిపింది.
సముద్రంలో పడవలు, ఓడలు వెళ్లే సమయంలో రాకపోకలకు ఎటువంటి అవాంతరం లేకుండా బ్రిడ్జి పైకి లేస్తుంది.అనంతరం యథాతథంగా తిరిగి సాధారణ రూపంలోకి వచ్చేస్తుందని వెల్లడించింది.