మెగాస్టార్ చిరంజీవి 154 వ సినిమా టైటిల్ ని దీపావళి సందర్భం గా రివీల్ చేయబోతున్నట్లుగా ఇటీవల అధికారికం గా ప్రకటించిన విషయం తెలిసిందే.బాబీ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా కు మొదట వాల్తేరు వీరన్న అంటూ టైటిల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో టైటిల్ ని ఈ సినిమా కోసం కన్ఫమ్ చేశారని వార్తలు వస్తున్నాయి.దీపావళి సందర్భం గా సినిమా టైటిల్ ని అధికారికం గా ప్రకటించబోతున్న విషయం తెలిసిందే.
కానీ ఒక రోజు ముందుగానే సినిమా కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికం గా ప్రకటించారు.
టైటిల్ అధికారికం గా ప్రకటించక పోవచ్చు.కానీ చిన్న వీడియో లేదా పోస్టర్ విడుదల చేయడం ద్వారా ఒక రోజు ముందు గానే దీపావళి ని ప్రేక్షకులకు అందించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.మెగా స్టార్ చిరంజీవి కి జోడి గా ఈ సినిమా లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ నటించిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా ఈ సినిమా లో రవితేజ కీలక పాత్ర లో కనిపించబోతున్నాడు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.ఒక మాస్ పాటకి చిరంజీవి మరియు రవితేజ వేసే డాన్స్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా అమితంగా ఆకట్టుకుంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా బలంగా చెబుతున్నారు.సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరికి కూడా వినోదాన్ని పంచుతుందని నమ్మకంను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
చిరంజీవి మరియు బాబీ దర్శకత్వం సినిమా సంక్రాంతికి వస్తున్న నేపథ్యం లో ఇతర సినిమాల యొక్క విడుదల తేదీల విషయంలో కాస్త అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.