బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమా అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు అదే సమయంలో అఖండ సక్సెస్ తో బాలయ్య మార్కెట్ పెరిగింది.
ఓవర్సీస్ లో కూడా బాలయ్య సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.
అయితే బాలయ్య అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు బాలయ్య పారితోషికం ఏకంగా 25 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.
యంగ్ జనరేషన్ స్టార్ హీరోల రేంజ్ లో బాలయ్య రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తుండటం గమనార్హం.మరోవైపు ఈరోజు బాలయ్య107 సినిమాకు సంబంధించిన టైటిల్ ను ప్రకటించనున్నారు.
దీపావళి కానుకగా బాలయ్య సినిమాకు సంబంధించిన అప్ డేట్ రానుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.
బాలయ్య అంచనాలకు మించి రెమ్యునరేషన్ ను పెంచేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సైతం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంటే బాలయ్య పారితోషికం మరింత పెరిగే అవకాశం అయితే ఉంది.సక్సెస్ ఫెయిల్యూర్ కు అతీతంగా బాలయ్య కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.
బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాలు కామెడీ కథాంశాలతో తెరకెక్కుతాయనే సంగతి తెలిసిందే.ఈ సినిమా మాత్రం గత సినిమాలకు భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతుండటం గమనార్హం.మరోవైపు బాలయ్య కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
వేగంగా సినిమాలలో నటించడం కంటే మంచి సినిమాలలో నటించడంపై బాలయ్య దృష్టి పెడుతున్నారు.బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.