టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో పాను ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్ సినిమా సినిమాకు తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ క్రేజ్ ని ఉంచుకుంటూ పోతున్నారు.
బాహుబలి సినిమా తర్వాత విడుదలైన సాహో, రాధే శ్యామ్ శ్యామ్ సినిమాలు డిజాస్టర్ చిన్నప్పటికి ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.అయితే ప్రభాస్ నటిస్తున్న తదుపరి సినిమా ఆది పురుష్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ అవుంతుంది అనుకుంటే, ఇటీవల విడుదలైన ఆ టీజర్ పైనే దారుణంగా ట్రోలింగ్స్ చేస్తూ విమర్శలను గుప్పించారు.
దీంతో ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమా విషయంలో కూడా అభిమానుల ఆశలు ఆవిరి అయ్యాయి.ఇప్పటికే ఈ సినిమా యానిమేషన్ డామినేటెడ్ సినిమాలో కనిపిస్తుంది అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
దీంతో ప్రభాస్ అభిమానులు ఆది పురుష్ సినిమాపై పెద్దగా హోప్స్ పెట్టుకోలేదు.దీంతో ప్రభాస్ అభిమానుల దృష్టి మొత్తం సలార్ సినిమాపై ఉంది.దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం సలార్.అయితే సలార్ సినిమా విషయంలో ప్రభాస్ అభిమానులు గుండెల మీద చేయి వేసుకొని ఉండవచ్చు అని సంకేతాలు ఇచ్చారు పృథ్వీరాజ్ సుకుమాన్.
కాగా పృథ్వీరాజ్ కుమారుణ్ సలార్ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా పృథ్వీరాజ్ పుట్టినరోజు సందర్భంగా సలార్ సినిమా నుంచి అతనికి సంబంధించిన లుక్ ని విడుదల చేశారు.ఇందులో పృథ్వీరాజ్ డిఫరెంట్ లుక్‌లో ఫెరోషియస్‌గా కనిపించాడు.ఈ సందర్భంగా తాజాగా పృథ్వీరాజ్ సుకుమాన్ మాట్లాడుతూ.
సలార్ పూర్తి స్థాయి యాక్షన్, మాస్ ఎంటర్టైనర్ అని అతను స్పష్టం చేశాడు.ప్రభాస్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా కనిపిస్తాడని, ఇందులో ఎలివేషన్లకు, మాస్ అంశాలకు లోటు ఉండదని తెలిపాడు.
అయితే ఆది పురుష్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ సలార్ సినిమాపై మాత్రం ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు.