మన భారతదేశంలో ఏ పండుగనైనా మన దేశ ప్రజలు చాలా మంది వరకు ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు.అలా మన దేశ ప్రజలందరూ జరుపుకునే పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి.
ఈ పండుగ చీకట్లో తొలగిస్తూ ప్రజల జీవితంలో వెలుగును నింపాలనే ఉద్దేశంతో ఆ పండుగ రోజున ఇల్లంతా దీపాలతో అలంకరించి దీపావళి పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటారు.అయితే దీపావళి పండుగ సందర్భంగా కొంతమంది కాల్చే కాకర్స్ వల్ల గణనీయంగా మన దేశం కాలుష్యం పెరుగుతుండడంతో పాటు పక్షులు ఇతర జీవరాసుల ప్రాణాలకి ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
తమిళనాడులో దీపావళి వేడుకలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా బాణాసంచా పేల్చడానికి, క్రాకర్స్ కాల్చే సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలని ప్రభుత్వం పోయిన సంవత్సరం తెలిపింది.
బాణసంచా కాల్చడానికి సంబంధించి పరిమితులు 2019 నుండి అమలులో ఉన్నాయి.ప్రజలు 2020 నుండి బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చడానికి ముందుగానే అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.నివాస సంఘాలు పొరుగున ఉన్న పౌర సంస్థల నుండి అనుమతిని అభ్యర్థించవలసి ఉంటుంది.
అదే సంవత్సరంలో మంటలు చెలరేగే అవకాశం ఉన్న ఆసుపత్రులు, ప్రార్థనా గృహాలు, మురికివాడలతో సహా సున్నితమైన ప్రాంతాలలో బాణాసంచా కాల్చకుండా ఆంక్షలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.జనతా గ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు అభిమానులు మాత్రం క్రాకర్స్ కాల్చకుండా దూరంగా ఉన్నారు.దీపావళి రోజున బాణాసంచా కాల్చడం పూర్తిగా మానేయాలని వారియర్ మామ్స్ అని పేరు ఉన్న తల్లుల సంఘం ప్రచారం చేస్తూ ఉంది.
ఎందుకంటే ఈ విధంగా వచ్చే కాలుష్యం వల్ల చిన్న పిల్లల తల్లుల ఆరోగ్యానికి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా ఈ తల్లుల సంఘం తెలిపింది.