ఈ దసరాకి ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర తలపడుతున్నారు.మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ తో వస్తుండగా.
కింగ్ నాగార్జున ది ఘొస్ట్ అంటూ రాబోతున్నాడు.లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ మూవీ వస్తుంది.
ఆ సినిమా ట్రైలర్ కూడా ఆసక్తికరంగానే అనిపించింది.అయితే గాడ్ ఫాదర్ ట్రైలర్ కి ఈక్వల్ గా క్రేజ్ తెచ్చుకుంది నాగార్జున ది ఘోస్ట్ ట్రైలర్.
నాగ్ యాక్షన్ సినిమాలు చేసి చాలా రోజులు అయ్యింది.ఆయన ఎప్పుడూ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేస్తారు.
నాగార్జున లాంటి స్టార్ హీరో నుంచి వస్తున్న యాక్షన్ మూవీ ది ఘోస్ట్.అది కూడా గరుడవేగ లాంటి సూపర్ హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు లాంటి డైరక్టర్ తో చేసిన సినిమా ఇది.ట్రైలర్ తోనే సినిమాపై ఓ ఇంట్రెస్ట్ ఏర్పడేలా చేశారు.తప్పకుండా మిగతా విషయాలు పక్కన పెడితే గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ ఈ రెండు సినిమాల ట్రైలర్స్ లో నాగ్ ట్రైలరే పై చేయి సాధించిందని చెప్పొచ్చు.
కొత్త కథతో నాగ్ సరికొత్త యాక్షన్ ఎటర్టైనర్ తో వస్తున్నాడు.మరి దసరా రోజు ఎవరి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.