పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణానికి జరిగిన నష్టంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.దీనిలో భాగంగా ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు బాధ్యత వహించదని న్యాయస్థానం ప్రశ్నించింది.
లాయర్లకు ఫీజులు చెల్లించడంలో ఉన్న శ్రద్ధ పర్యావరణ రక్షణలో లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.లాయర్లకు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం పర్యావరణ నష్టాన్ని ఎందుకు భరించదని అడిగింది.అయితే, పర్యావరణ నష్టంపై గతంలో ఎన్జీటీ రూ.120 కోట్లు జరిమానా విధించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఎన్జీటీ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.ఈ పిటిషన్ పై విచారించిన జస్టిస్ అజయ్ రస్తోగి, రవికుమార్ ధర్మశానం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసులో లాయర్ల కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసుకునేందుకు నోటీస్ ఇస్తామని తెలిపింది.ఒక్క కేసుకు ఎంతమంది సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేస్తారని ప్రశ్నించిన ధర్మాసనం.
సీనియర్ లాయర్లను రంగంలోకి దించడంలో ఉన్న ఆసక్తి పర్యావరణ పరిరక్షణపై లేదని మండిపడింది.