టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నటుడు రావు రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు రావు రమేష్.
తన నటనతో ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసి ప్రేక్షకులను మెప్పించగల నటుడు రావు రమేష్.హీరో హీరోయిన్లకు ఫాదర్ గా, అలాగే విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రావు రమేష్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది.అదేమిటంటే రావు రమేష్ ఇటీవలే మృతి చెందిన తన మేకప్ ఆర్టిస్ట్ కుటుంబానికి అండగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నారు.
రావు రమేష్ పర్సనల్ మేకప్ మ్యాన్ గా పని చేస్తున్న బాబు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు.ఇక అతని మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన రావు రమేష్ ఇటీవల ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.
అనంతరం ఆ కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.అంతేకాకుండా వారికి ఎటువంటి కష్టం వచ్చినా తాను ముందు ఉండి సహాయం చేస్తాను అని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ విషయం పట్ల రావు రమేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు.
వారి వద్ద పనిచేసే కార్మికులను,కళాకారులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది మీరు అలాంటి వరకు స్ఫూర్తి అంటూ రావు రమేష్ ని కొనియాడుతున్నారు.కాగా రావు రమేష్ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇప్పటివరకు దాదాపుగా తెలుగులో 50కి పైగా సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
ఇటీవల భీమ్లా నాయక్,బంగార్రాజు లాంటి సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.అప్పుడప్పుడు సినిమాలలో తనదైన శైలిలో కామెడీ చేస్తూ కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.