రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లక్ ఏంటో కానీ అనూహ్యంగా ఆయన వరుసగా ఫ్లాప్ లు చవి చూస్తున్నా కూడా వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం తర్వాత ఇప్పటి వరకు కమర్షియల్ సక్సెస్ లను ఈయన దక్కించుకోలేదు.
అయినా కూడా జోరు మాత్రం తగ్గలేదు.ఓకే అనాలే కానీ ఈయనకి పది సినిమాలు లైన్ లో ఉన్నాయి.
అందులో చిన్నా చితక సినిమాలు మాత్రమే కాకుండా స్టార్ దర్శకుల సినిమాలు. పెద్ద బ్యానర్ ల సినిమాలు కూడా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా పాపులారిటిని దక్కించుకున్న ఈ రౌడీ స్టార్ త్వరలోనే మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అదే ఖుషి.
శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా ఇంకా షూట్ లో ఉండగానే మరో ప్రముఖ దర్శకుడు విజయ్ దేవరకొండ డేట్ల కోసం చాలా ప్రయత్నిస్తున్నాడట.
ఆయన ఇటీవలే సూపర్ హిట్ ని దక్కించుకున్నాడు.
అతడు ఇప్పుడు విజయ్ దేవరకొండ తో సినిమాను చేయాలని ఆశ పడుతున్నాడట.రౌడీ స్టార్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు షూటింగ్ మొదలు పెట్టాలని ఎదురు చూస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది.
ఆ దర్శకుడు గతంలో ఒక స్టార్ హీరోతో కూడా సినిమాను చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.కనుక తప్పకుండా విజయ్ దేవరకొండ కి సక్సెస్ లేని లోటును తీర్చే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో రౌడీ స్టార్ పై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆయన జోరు మాత్రం తగ్గడం లేదు.సక్సెస్ లేకున్నా ఇంతగా సినిమాలు చేసే హీరో కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే అయ్యి ఉంటాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.