గేమ్స్ ఆడేటప్పుడు ప్లేయర్లకు సూపర్ ఫన్ లభిస్తుంది.అయితే గేమ్స్‌లోని లెవెల్స్ లేదా గేమ్ ప్లే అనేది బాగా హార్డ్ గా ఉంటే ఫన్ కి బదులు విరక్తి వస్తుంది.
అలాగని ఈ గేమ్స్ చాలా ఈజీగా ఉంటే ఎలాంటి ఎంజాయ్మెంట్ లభించదు.ఈ రెండు పరిస్థితులు ఏ ప్లేయర్ కు రాకూడదని గేమ్ డెవలపర్స్ ‘డైనమిక్ డిఫికల్టీ అడ్జస్ట్‌మెంట్’ని టాప్ గేమ్స్‌లో అందిస్తుంటారు.
ఇది రియల్ టైమ్‌లో ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఆధారంగా డిఫికల్ట్ లెవెల్‌ను అడ్జస్ట్ చేస్తుంది.
అయితే డిఫికల్టీ అడ్జస్ట్ చేయడం వరకు పర్లేదు కానీ దానివల్ల గేమర్‌కి తగినంత ఫన్ అందుతుందా లేదా అనేది మాత్రం డైనమిక్ డిఫికల్టీ అడ్జస్ట్‌మెంట్ తెలుసుకోలేదు.
దీనివల్ల ప్లేయర్ గేమ్ ఎంజాయ్ చేస్తున్నాడా లేదా అనేదానిని డెవలపర్లు నిర్ధారించుకోకపోతున్నారు.ఈ క్రమంలోనే కొరియన్ డెవలపర్లు గేమింగ్‌లో ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చారు.
కొరియాలోని గ్వాంగ్‌జు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చర్లు.ఛాలెంజ్, కాంపిటెన్స్, ఫ్లో, వాలెన్స్ అనే నాలుగు విభిన్న అంశాల ఆధారంగా గేమింగ్ డిఫికల్టీస్‌ను అడ్జస్ట్ చేసే మెథడ్ తీసుకొచ్చారు.ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తోంది.రియల్ హ్యూమన్ ప్లేయర్స్ నుంచి సేకరించిన డేటా సాయంతో మెషిన్ లెర్నింగ్‌ని ఉపయోగించి ఇది డిఫికల్టీస్‌ను అడ్జస్ట్ చేస్తుంది.

అలాగే ఎంజాయ్ చేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా అడుగుతుంది.అప్పుడు ప్లేయర్ ఇచ్చిన సమాధానం ప్రకారం గేమ్ ని మరింత ఫన్‌గా మారుస్తుంది.ఆ విధంగా గేమర్స్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఆధారంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది