కృష్ణంరాజు మొదటి భార్య ఎవరు ఎలా మరణించారో తెలుసా?

రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈయన మరణ వార్త తెలిసిన ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.

 Do You Know Who And How The First Wife Of Krishna Raja Died, Krishna Raja Died,-TeluguStop.com

అలాగే అత్యంత సన్నిహితులు ఆస్పత్రికి వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు.సినిమా ఇండస్ట్రీకి అద్భుతమైన సేవలను అందించిన కృష్ణంరాజు నేడు మన మధ్యన లేకపోవడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఇక ఈయన మరణించడంతో ఈయనతో తమకున్న అనుబంధం గురించి సెలబ్రిటీలు రాజకీయ నాయకులు గుర్తుచేసుకొని ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.

ఈ విధంగా రాజకీయాలలోనూ సినిమాలలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన 1940 జనవరి 20వ తేదీ మొగల్తూరులో జన్మించారు.

బాల్యం మొత్తం అక్కడే చదువు పూర్తి చేసుకున్నటువంటి కృష్ణంరాజు అనంతరం నటనపై ఆసక్తితో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన సీతాదేవి అనే అమ్మాయిని మొదటి వివాహం చేసుకున్నారు.

Telugu Problems, Krishna Raja, Sita Devi-Movie

ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి కృష్ణంరాజు సీతాదేవి దంపతులకు ఒక కుమార్తె జన్మించారు.ఇలా తన భార్యతో ఎంతో సంతోషంగా ఉన్న కృష్ణంరాజుకు ఆ సంతోషం కొద్ది రోజులు పాటు మాత్రమే మిగిలిందని చెప్పాలి.1995లో ఓ కారు ప్రమాదంలో సీతాదేవి మృతి చెందారు.ఇలా ఎంతగానో ప్రేమించినటువంటి భార్య మృతి చెందడంతో కృష్ణంరాజు పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

ఈయన పరిస్థితి చూసిన కుటుంబ సభ్యులు బలవంతంగా తనని రెండవ పెళ్లికి ఒప్పించి 1996లో శ్యామల దేవితో తనకు రెండవ వివాహం జరిపించారు.ఇక ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇక కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube