టాలీవుడ్ లో రొమాంటిక్ యాంగిల్ బీభత్సం గా ఉన్న దర్శకులు వీళ్ళే !

ఒక్క సినిమా హిట్ అవ్వాలంటే హీరోయిజం, కామెడీ, యాక్షన్, ఫైట్స్ మరియు సెంటిమెంట్ ఎంత ముఖ్యమో రొమాంటిక్ సన్నివేశాలు, పాటలు ఉండటం కూడా అంతే ముఖ్యం.

ఎంత పెద్ద దర్శకుడు అయినా కూడా తమ సినిమాలో హీరోయిన్ తో రొమాంటిక్ సన్నివేశాలు చేయించాలని, ఐటెం భామ తో మాస్ స్టెప్స్ తో అంగాంగ ప్రదర్శన చేయించాలని చూస్తాడు.

ఆ సన్నివేశాలు కూడా సినిమాకు యువతను రప్పిస్తాయి అనేది దర్శకుల స్ట్రాటజీ.ఇక ఈ మధ్య కాలంలో అయితే మితిమీరిన శృంగార సన్నివేశాలు సైతం సినిమా మంచి బజ్ ని క్రియేట్ చేస్తాయి.

ఇక చాల మంది ప్రేక్షకులకు రొమాంటిక్ యాంగిల్ అంటే ఏంటో తెలియక భూతు సినిమాలను కూడా రొమాంటిక్ మూవీస్ గా చూస్తూ ఉంటారు.అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే టాలీవుడ్ దర్శకులలో మంచి రొమాంటిక్ యాంగిల్ వుంది.

కానీ అవి భూతు సినిమాలు కాదండోయి ప్రభాస్ లాంటి స్టార్ హీరోస్ నటించిన కూడా హీరోయిన్స్ తో మంచి మసాలా సన్నివేశాలు చేయించిన ఆ టాలీవుడ్ దర్శకులు ఎవరో చూద్దాం.

రాఘవేంద్ర రావు

శతాధిక దర్శకుడిగా టాలీవుడ్ లో మంచి రొమాంటిక్ సినిమాలు చేసిన గుర్తింపు కేవలం రాఘవేంద్ర రావు సొంతం.

Advertisement

అయన ప్రతి సినిమాలో హీరోయిన్స్ తో ఒక ఆట ఆడేసి అన్ని రకాల పాలు పళ్ళను, పూలను వాడుతూ సినిమా ప్రమోషన్స్ గట్టిగ చేస్తూ ఉంటాడు.

పూరి జగన్నాధ్

ఇక పూరి జగన్నాధ్ సినిమా అంటే ఖచ్చితంగా ఒక ఖతర్నాక్ ఐటెం పాట ఉండాల్సిందే.ఒక్కో సినిమాకు ఒక్కో ఐటెం భామను పరిచయం చేస్తూ ఐటెం రాజా అంటేనే పూరి అనే రేంజ్ లో ఆయనకు గుర్తింపు వుంది.

కృష్ణవంశీ

ఇక సినిమాలో హీరోయిన్స్ ని అందంగా చూపించడం లో రొమాంటిక్ సన్నివేశాలు అద్భుతంగా తీయడంలో కృష్ణ వంశి సైతం ముందు వరసలో ఉంటాడు.

అయన నాచురాలిటీ కి పెట్టింది పేరు.అందుకే కృష్ణ వంశి సినిమాలో ఒక్క సారి హీరోయిన్ అయ్యిందంటే చాలు ఆమెకు ఇక టాలీవుడ్ లో అవకాశాలు కొదవ ఉండదు.

రామ్ గోపాల్ వర్మ

ఇక ఈ లిస్ట్ లో రామ్ గోపాల్ వర్మ ఒక లైన్ క్రాస్ చేసి మరి సినిమాలు తీస్తూ ఉంటాడు.హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో, భూతు కంటెంట్ తో సినిమాలను తీయడం కేవలం రామ్ గోపాల్ వర్మకే చెల్లింది.

రాజమౌళి

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

రొమాంటిక్ యాంగిల్ అంటూ రాజమౌళి పేరు చెప్తున్నా అంటూ అనుకుంటున్నారు కదా ? రాజమౌళి కూడా మంచి రసికుడే.అయన తీసిన విక్రమార్కుడు సినిమాలో అనుష్క ని చూపించిన విధం చూస్తే అది మీకు అర్ధం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు