రాష్ట్ర విభజనకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.ఈ క్రమంలో చంద్రబాబు లాంటి వ్యక్తులను దేశ బహిష్కరణ చేయాలన్నారు.
సెప్టెంబర్ 1న ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారం లాక్కున్నారని విమర్శించారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి టీడీపీలో అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పడం దారుణమని వ్యాఖ్యనించారు.
శాంతి భద్రతలు అతిక్రమించిన చంద్రబాబు, లోకేశ్ లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.