అదిరిపోయే సేవలు తీసుకొస్తున్న జొమాటో... ఇకపై ఫుడ్ లవర్స్‌కి పండగే!

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తాజాగా ఇంటర్‌‌సిటీ లెజెండ్స్ అనే సరికొత్త ఫుడ్‌ సర్వీస్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది.దీని ద్వారా మీరు సుదూర ప్రాంతాల్లోని ఫేమస్ ఫుడ్‌ను అక్కడి స్థానిక ఫేమస్ రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేయవచ్చు.

 Zomato, Which Is Bringing A Lot Of Services Is Now A Feast For Food Lovers , Zo-TeluguStop.com

ప్రస్తుతం కేవలం ఒక సిటీ పరిధిలో ఉన్న రెస్టారెంట్లు ద్వారానే జొమాటో డెలివరీ బాయ్స్ ఫుడ్ డెలివరీ చేస్తున్నారు.కానీ ఇకపై మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ వేరే నగరాల్లో నుంచి విమానాల్లో ద్వారా మీకు అందనుంది.

ఉదాహరణకి మీరు హైదరాబాద్ లో ఉన్నారని అనుకోండి.కానీ మీకు ముంబై నుంచి వడ పావ్ ప్రముఖ ముంబై రెస్టారెంట్ నుంచి కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టొచ్చు.

ప్రస్తుతానికి ఈ సేవ అన్ని నగరాల్లోనూ ఇంకా ప్రారంభించలేదు.త్వరలో ఈ సేవలు అన్ని సిటీల్లో విస్తరిస్తే మీరు ఇంట్లో కూర్చొని ఢిల్లీ వంటి సిటీల నుంచి కూడా ఆర్డర్లు పొందవచ్చు.

కాకపోతే ఈ డెలివరీకి 24 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.ఆ సమయంలో అవి పాడుకాకుండా కోల్డ్ స్టోరేజ్ లో డెలివరీ ఏజెంట్స్‌ సెండ్ చేయనున్నారు.

జొమాటో ప్రకారం ప్రస్తుతానికి ఈ అద్భుతమైన సర్వీస్ గుర్గావ్, దక్షిణ ఢిల్లీ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.వీరు ‘ఇంటర్‌సిటీ’ ఆర్డర్లను ప్లేస్ చేసుకోవచ్చు.అయితే ఈ సర్వీసు కింద ఒక్కో సిటీలోని కేవలం కొన్ని ఫేమస్ రెస్టారెంట్లను మాత్రమే లిస్ట్ చేయనుంది.కస్టమర్లు ఇంటర్‌‌సిటీ ఆర్డర్స్ ఇవ్వాలంటే ఈ లిస్టులో నుంచే రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Telugu Delivery, Zomato-Latest News - Telugu

జైపూర్ నుంచి కచోరీ, కోల్‌కతా నుంచి కాల్చిన రసగుల్లాస్, హైదరాబాద్ నుంచి బిర్యానీ, బెంగళూరు నుంచి మైసూర్ పాక్, లక్నో నుంచి కబాబ్‌లు, ఓల్డ్ ఢిల్లీ నుంచి బటర్ చికెన్ వంటి ఫేమస్ ఫుడ్స్‌ను త్వరలోనే భారతదేశం అంతటా హోమ్ డెలివరీ చేయనున్నట్లు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ పేర్కొన్నాడు.ప్రస్తుతానికి ఇంటర్‌‌సిటీ లిస్ట్‌లో కోల్‌కతా, హైదరాబాద్, లఖ్నో, జైపూర్, బెంగళూరు, మధుర, చెన్నై, ఆగ్రా, భువనేశ్వర్‌ నుంచి ఢిల్లీ గుర్గావ్ కస్టమర్లు ఫుడ్స్ ఆర్డర్ పెట్టొచ్చు.అయితే షిప్పింగ్ ఛార్జెస్ కారణంగా నార్మల్ డెలివరీ కంటే వీటి డెలివరీ ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube