కార్తీక దీపం శౌర్యకు మంచి అవకాశం వచ్చిందిగా.. మెగాస్టార్ టైటిల్ తో వెబ్ సిరీస్!

తెలుగు బుల్లితెర పేక్షకులకు కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు టెలివిజన్ పై ప్రసారం అవుతున్న ఈ కార్తీకదీపం సీరియల్ ఎంతటి సెన్సేషన్ ను క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే.

 Karthika Deepam Fame Krithika First Look In Gang Leader Movie Details, Karthika-TeluguStop.com

కాగా ఈ సీరియల్ నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ లకు మంచి గుర్తింపు దక్కింది.కార్తీకదీపం సీరియల్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చి పేర్లు వంటలక్క,డాక్టర్ బాబు.

ఈ పేరు తర్వాత ఎక్కువగా వినిపించే పేర్లు సౌర్య,హిమ.ఇకపోతే మొన్నటి వరకు కూడా కార్తీకదీపం సీరియల్ చప్పగా సాగింది.

సీరియల్ లో డాక్టర్ బాబు వంటలు అక్కను చంపేసి కొత్త క్యారెక్టర్లతో కొత్త కథను నడిపిద్దామని అనుకున్నప్పటికీ అంతగా సక్సెస్ కాకపోవడంతో వంటలెక్కని డాక్టర్ బాబుని మళ్లీ రీ ఎంట్రీ ఇప్పించారు.

అలా మొత్తానికి ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ మళ్లీ మొదటికే చేరుకుంది.

ఇది కార్తీకదీపం సీరియల్ లో నటించిన వారికి మంచి ఫేమ్ దక్కడంతో పాటు వెండితెరపై కూడా అవకాశాలు వస్తున్నాయట.ఈ సీరియల్ లో నటించిన వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ ఆల్రెడీ సినిమాను పట్టాలెక్కించినట్టు తెలుస్తోంది.

ఇకపోతే కార్తీకదీపం సీరియల్ లో రౌడీ, సౌర్య పాత్రలో నటించిన కృతిక ఈ వయసు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.ఇప్పటికే పలు సినిమాలలో నటించిన కృతిక పలు సీరియల్స్ లో కూడా అవకాశాలు అందుకుంటూ కెరిర్ పరంగా దూసుకెళ్తోంది.

Telugu Gang, Gang Web, Karthika Deepam, Karthikadeepam, Krithika, Krithika Offer

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం కృతిక ఈ ప్రస్తుతం మెయిన్ లీడ్ లో గ్యాంగ్ లీడర్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది.వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ పోస్టర్ ను విడుదల చేశారు.ఇక అందులో కృతిక పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది.మొత్తానికి కార్తీకదీపం సీరియల్ తో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న కృతిక సీరియల్స్ సినిమాలోనే కాకుండా ఓటిటిలో కూడా వరుస అవకాశాలతో దూసుకుపోయే విధంగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube