కెనడాతో విభేదాలు.. ఒట్టావాలో భారత తాత్కాలిక హైకమీషనర్‌గా నాయక్!

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) ప్రభుత్వం దూకుడు పెంచడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.ఈసారి ఏకంగా కెనడాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మను( Sanjay Kumar Verma ) అనుమానితుల జాబితాలో చేర్చడంపై మోడీ సర్కార్ భగ్గుమంది.

 Chinmoy Naik Named Indias Acting Canada High Commissioner Details, Chinmoy Naik-TeluguStop.com

ఆధారాలు లేకుండా ఇలాంటి చర్యలు విపరీత పరిణామాలకు దారి తీస్తాయని హెచ్చరించింది.జస్టిన్ ట్రూడో కారణంగా భారత్ – కెనడా మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతింటాయనని ఆందోళన వ్యక్తం చేసింది.

అలాగే ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమీషనర్ సహా దౌత్య సిబ్బందిని బహిష్కరించింది.

Telugu Canada, Chinmoy Naik, Hardeepsingh, India Canada, Indian, Justin Trudeau,

అయితే కెనడా( Canada ) మాత్రం దూకుడు తగ్గించేలా కనిపించడం లేదు.అవసరమైతే భారత్‌పై( India ) ఆంక్షలు విధించాలని భావిస్తోంది.రాయల్ మౌంటెడ్ కెనడియన్ పోలీస్ (ఆర్‌సీఎంపీ) చీఫ్ అయితే భారత్‌పై మరింత నోటీ దురుసు చూపించారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ద్వారా భారత ప్రభుత్వం కెనడాలో ఆపరేషన్లు నిర్వహిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.కెనడాలో జరుగుతున్న హింసాత్మక ఘటనల వెనుక భారత ప్రభుత్వం ఉందన్నట్లుగా సమాచారం ఉంటే సంప్రదించాలని సిక్కులకు ఆయన పిలుపునిచ్చారు.

Telugu Canada, Chinmoy Naik, Hardeepsingh, India Canada, Indian, Justin Trudeau,

మరోవైపు.కెనడాలోని పరిస్ధితులను నిశితంగా పరిశీలిస్తున్న భారత ప్రభుత్వం ఒట్టావాలో( Ottawa ) తాత్కాలిక హైకమీషనర్‌గా చిన్మోయ్ నాయక్‌ను( Chinmoy Naik ) నియమించింది.ఈ మేరకు కెనడాలోని భారత హైకమీషన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.కెనడాతో దౌత్య వివాదం నేపథ్యంలో సంజయ్ కుమార్ వర్మ సహా మరో ఐదుగురు దౌత్య సిబ్బందిని భారత్ వెనక్కి పిలిచిన నేపథ్యంలో వారి బాధ్యతలను నాయక్ స్వీకరించారు.

నాయక్ ఫిబ్రవరి 2023 నుంచి ఒట్టావాలోని హైకమీషన్ ఆఫ్ ఇండియా డిప్యూటీ కమీషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.2004 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి అయిన చిన్మోయ్ నాయక్. గతంలో బీజింగ్, ప్యారిస్‌లోని భారత రాయబార కార్యాలయాల్లో పనిచేశారు.న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయంలో ఉండగా.యురేషియా, నిరాయుధీకరణ, కొత్త సాంకేతికతలు, సాంస్కృతిక దౌత్యానికి సంబంధించిన వ్యవహారాలను నాయక్ నిర్వర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube