ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 149 దరఖాస్తుల రాక రాజన్న సిరిసిల్ల :ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు కలెక్టర్ స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావాణి ద్వారా వచ్చే ఆర్జిల పరిష్కారంలో జాప్యం వద్దని పేర్కొన్నారు.మొత్తం 149 దరఖాస్తులు రాగా, రెవెన్యూ శాఖకు 76, సిరిసిల్ల మున్సిపల్ కు 18 ,విద్యా శాఖకు, జిల్లా వైద్యాధికారి, ఎస్డీసీ, డీఆర్డీఓకు 6, జిల్లా పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ కు 4, ఉపాధి కల్పన శాఖకు 3, ఎస్సీ కార్పొరేషన్, ఎంపీడీవో తంగళ్ళపల్లి, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, కోనరావుపేట, సెస్ శాఖకు రెండు చొప్పున, ఏడీ సర్వే, మైన్స్, అటవీశాఖ, ఎల్ డీఎం, డీ ఎస్ సీ డీ ఓ, దేవాదాయ శాఖ ఒకటి చొప్పున వచ్చాయి.
ఇక్కడ అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీఆర్డీఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు