తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.36 ఏళ్ల తర్వాత టీమిండియాను న్యూజిలాండ్ జట్టు( New Zealand team ) భారత్ లో ఓడించింది.టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆల్ అవుట్ కావడం ఈ అపజయానికి ముఖ్య కారణం.ఇకపోతే, మొదటి టెస్ట్ ముగిసిన తర్వాత రెండో టెస్ట్ కోసం టీం ఇండియా సభ్యులు పూణే నగరానికి చేరుకున్నారు.
అక్టోబర్ 24 నుండి రెండో టెస్టు పూణేలో జరగనుంది.ఇదిలా ఉంటే టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli )మాత్రం ముంబైకి వెళ్లి తన ఫ్యామిలీతో గడపాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ తన భార్యతో కలిసి ముంబై నగరంలో( Mumbai ) జరిగిన కృష్ణదాస్ కీర్తనలకు హాజరయ్యాడు.ఇదివరకు జూలై నెలలో కూడా కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి లండన్ నగరంలో ఇలాంటి కీర్తనలకే హాజరయ్యాడు కూడా.అప్పుడు కూడా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.ముంబై నగరంలో జరిగిన కీర్తనలో భాగంగా పాల్గొన్న విరాట్ కోహ్లీ దంపతులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా జంట కీర్తన కార్యక్రమానికి హాజరై, వారు భక్తిశ్రద్ధలతో ‘కర్వా చౌత్’ ( Karva Chauth )పండుగను జరుపుకున్నారు.కృష్ణదాస్ కీర్తన కార్యక్రమం జరుగుతున్న సమయంలో వారిద్దరూ హాజరయ్యారు.
ఇకపోతే టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన విరాట్ కోహ్లీ మాత్రం ఓ వ్యక్తిగత మైలురాయని అందుకున్నాడు.టెస్టుల్లో ఆయన 9000 పరుగుల మార్కును దాటాడు.తొలి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ గా వినతిరిగిన విరాట్ కోహ్లీ రెండో ఎండింగ్ 70 పరుగులను చేశాడు.