టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) త్వరలోనే సిటాడెల్( Citadel ) అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సిరీస్ తెలుగులో హనీ బన్నీ( Honey Bunny ) అనే పేరిట విడుదల కానుంది.
నవంబర్ 7వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.ఇటీవల ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో భాగంగా నటీనటులతో పాటు ఈ సిరీస్ డైరెక్టర్ రాజ్ అండ్ డీకే( Raj And DK ) పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వీరు సమంతకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
ది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ షూటింగ్ సమయంలో సిటాడేల్ వెబ్ సిరీస్ ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది.అందుకే ఈ సిరీస్ గురించి మేము సమంత వద్ద ఎక్కడ ప్రస్తావించలేదు ఇక ఈ స్క్రిప్ట్ పూర్తి అయ్యి ఫ్రీ ప్రొడక్షన్ పనులన్ని పూర్తయిన తర్వాత హీరోగా వరుణ్ ధావన్ ను ఎంపిక చేసాము.ఈయన హిందీ( Hindi ) బాగా మాట్లాడుతాడు కనుక హీరోయిన్ కూడా హిందీ మంచిగా మాట్లాడే అమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నాము.
అప్పటివరకు కూడా సమంతను హీరోయిన్గా తీసుకోవాలని అసలు అనుకోలేదు.
ఇది ఫ్యామిలీ మెన్ 2 శిరీష సమయంలో సమంత ఎక్కడ కూడా హిందీలో మాట్లాడినట్టు మేము వినలేదు.అయితే ఒకసారి ఈమె హిందీలో అనర్గంగా మాట్లాడటం విని ఆశ్చర్యపోయాము ఆ క్షణమే సమంతను హీరోయిన్గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాము అంటూ రాజ్ అండ్ డీకే తెలిపారు.ఇక ఈ వ్యాఖ్యలపై సమంత స్పందిస్తూ తాను హిందీ బాగా మాట్లాడుతాను కానీ ఎక్కడైనా తప్పులు ఉంటాయో ఏమో అన్న భయంతోనే వేదికలపై మాట్లాడనని తెలిపారు.
ఇక ఇదే విషయం గురించి వరుణ్ ధావన్( Varun Dhawan ) మాట్లాడుతూ దర్శకులు ఈ ప్రాజెక్టు గురించి నాకు చెప్పినప్పుడు ముందుగా నాకు సమంతనే గుర్తుకు వచ్చారు.ఈ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేవారు సమంత మాత్రమే అని వరుణ్ ధావన్ వెల్లడించారు.