బిగ్ బాస్ హౌస్ లో వాళ్లిద్దరి మధ్య ప్రేమ.. నాగ మణికంఠ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు( Bigg Boss 8 Telugu ) ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.కావలసినంత ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ, షాకింగ్ ట్విస్ట్ లు, షాకింగ్ ఎలిమినేషన్ లతో రసవత్తరంగా సాగుతోంది.

 Naga Manikanta Bigg Boss 8 Telugu Buzz Interview Details, Naga Manikanta, Bigg B-TeluguStop.com

ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో మరొక షాకింగ్ ఎలిమినేషన్ జరిగిన విషయం తెలిసిందే.ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు నాగమణికంఠ.

( Naga Manikanta ) చాలామంది నాగ మణికంఠ ఎలిమినేషన్ ని అసలు ఊహించలేకపోయారు.కాగా బిగ్ బాస్ సీజన్ 8 లో హౌస్ లో కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ ఎవరు అంటే నాగమణికంఠ పేరు ఫస్ట్ వినిపిస్తూ ఉంటుంది.

ఇప్పుడు ఏం చేస్తాడో ఎలా ప్రవర్తిస్తాడో అతనికే తెలియదు.హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో భార్యబిడ్డలు కావాలి అని నానా హంగామా చేశాడు.ఇప్పుడవన్నీ పక్కనబెట్టి సరిగా ఆడుతున్నాడేమో అనుకుంటే ఆరోగ్యం బాగోలేదని చెప్పి తనకు తానుగా బయటకొచ్చేశాడు.కానీ ఇప్పుడేమో మాటలు మార్చేస్తున్నాడు.

బిగ్‌బాస్ బజ్( Bigg Boss Buzz ) ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నకు తిన్నగా సమాధానం చెప్పకుండా అర్జున్‪‌ కే ఝలక్స్ ఇచ్చాడు మణికంఠ.గెలవాలనే ఆలోచనతో వచ్చిన మీరు కనీసం చీఫ్ అవ్వకుండానే బయటకు ఎందుకొచ్చారు? అని హోస్ట్ అర్జున్ ( Arjun ) అడగగా.విన్నర్ అవ్వాలనే ఆలోచనతో అయితే నేను రాలేదని మణికంఠ అనడంతో అర్జున్ నోరెళ్లబెట్టాడు.

Telugu Arjun, Biggboss, Manikantabigg, Manikanta, Naga Manikanta, Nikhil, Prithv

అదెంత పెద్ద కంటెంటో తెలుసా అని ఆశ్చర్యపోయాడు.నా పెళ్లాం బిడ్డ నాకు కావాలి.నా రెస్పెక్ట్ నాకు కావాలి అని మణికంఠలా ప్రవర్తించి అర్జున్ చూపించాడు.

అప్పటివరకు నవ్వు ముఖంతో ఉన్న మణికంఠ కాస్త దెబ్బకు డీలా పడిపోయాడు.గోరంత దాన్ని కొండంత చేస్తావ్ అని హౌస్‌మేట్స్ అభిప్రాయం.

దీనిపై ఏమంటావ్ అని అడగగా.నేను ఆలోచించే విధానం అలా ఉంటుంది కాబట్టి రియాక్ట్ అయ్యే విధానం కూడా అలానే ఉంటుందని మణికంఠ చెప్పాడు.

సరే ఇవన్నీ కాదు గానీ హౌస్‌లో నువ్వు చేసిన పాజిటివ్ విషయం ఒకటి చెప్పు అని అర్జున్ అడగ్గా, నేను నాలా ఉండటమే పాజిటివ్ అంటూ మణికంఠ తలతిక్క సమాధానం చెప్పాడు.

Telugu Arjun, Biggboss, Manikantabigg, Manikanta, Naga Manikanta, Nikhil, Prithv

దాంతో అర్జున్ కాస్త ఆశ్చర్యపోయాడు.నీకు సాయం చేసిన వాళ్లనే నువ్వు వెన్నపోటు పొడిచావ్ అంటే ఏమంటావ్? అని అడగ్గా.ఇదైతే అస్సలు అంగీకరించను అని మణికంఠ అన్నాడు.

హౌస్‌లో డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని మీకు అనిపించిందా? అంటే తడముకోకుండా నిఖిల్ పేరు చెప్పాడు.ఇక పృథ్వీ,( Prithvi ) విష్ణుప్రియ( Vishnu Priya ) మధ్య రెండు వైపుల నుంచి ప్రేమ చిగురిస్తోందని చెప్పి షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.

ఇది మాకు తెలీదయ్యో అని హోస్ట్ అర్జున్ షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.కాగా ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube