రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడంలేదని పోలీసు వ్యవస్థను ప్రభుత్వం తక్ష సాధింపు లకు మాత్రమే వాడుకుంటుందని వైసిపి నాయకురాలు మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్న పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు ,లోకేష్ ( Pawan Kalyan, Chandrababu, Lokesh )లకు కనిపించడం లేదా అని రోజా ప్రశ్నించారు.” కూటమి పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి.పోలీసు వ్యవస్థను కేవలం కక్ష సాధింపునకు మాత్రమే వాడుకుంటుంది బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కనీసం భరోసా ఇవ్వలేకపోతోంది చంద్రబాబు అసమర్థత వల్లే అగైత్యాలు జరుగుతున్నాయి మహిళలపై దాడులు జరుగుతుంటే హోమ్ మంత్రి అనిత వెటకారంగా మాట్లాడుతున్నారు.
రాష్ట్రంలో మహిళలపై దాడులు పవన్ లోకేష్ కు కనిపించడం లేదా వైయస్సార్ సిపి హయాంలో దిశా యాప్( Disha app ) తీసుకువచ్చాము దిశ యాప్ ద్వారా ఎందరో అభాగ్యులకు న్యాయం జరిగింది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే దిశ యాప్ ను పునరుద్ధరించాలి.ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు న్యాయం ఎందుకు చేయడం లేదు రాష్ట్రంలో ఉన్మాదులు నేరస్తులు పేట్రేగిపోతున్నారు గుంటూరులో నవీన్ ( Naveen )అనే వ్యక్తి పెమ్మసాని అనుచరుడు.అమ్మాయి మీద దాడి చేస్తే కనీసం పట్టించుకోలేదు హోమ్ మంత్రి డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు చెప్పేది చేతల్లో శూన్యం మీ చేతగానితనం వల్ల విజయవాడ వరదల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు 74 మందికి పైన ఆడపిల్లలపై అత్యాచారాలు హత్యలు జరిగాయి బద్వేలలో మహిళను హత్య చేస్తే సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్లి అన్ స్టాపబుల్ సోలో పాల్గొన్నారు.ప్రజలు అందరూ కష్టాల్లో ఉన్నాడు చంద్రబాబు రియాలిటీ షోలో సంతోషంగా ఉన్నారు.
ఎంతమంది మహిళలపై అత్యాచారం రాష్ట్రంలో జరుగుతుంటే షూటింగ్లో పవన్ బిజీగా ఉన్నారు.ఎందుకైనా మీకు ఓట్లు వేసింది పవన్ అని అడుగుతున్నాను.మదనపల్లిలో ఫైల్స్ కాలిపోతే స్పెషల్ విమానంలో పంపిస్తారు కేబినెట్లో మహిళా భద్రత గురించి ఏ రోజైనా చర్చించారా తీశా చట్టం మహిళా పోలీస్ స్టేషన్లు ( Women Police Stations )గత ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తే వాటిని నిర్వీర్యం చేశారు చంద్రబాబు లోకేష్ కు ఆడబిడ్డ విలువ తెలియదు పవన్ ఒక ఆడబిడ్డ తండ్రిగా ఆలోచన చేయండి కంటిమీద కొనుక్కులేదు రాష్ట్రంలో ఆడబిడ్డల తల్లిదండ్రులు బాధపడుతున్నారు బాలకృష్ణ… షూటింగ్స్ చేసుకునే వాళ్లకు ఎందుకు రాజకీయాలు మీ నియోజకవర్గంలో అత్త కోడల పై అత్యాచారం చేస్తే కనీసం పట్టించుకోలేదు ఆడబిడ్డలకు ఈరోజు రక్షణ లేకుండా పోయింది రెడ్బుక్ రాజ్యాంగం పక్కన పెట్టండి ఓట్లు వేసిన ప్రజలను పట్టించుకోండి ” అంటూ రోజా తనదైన శైలిలో విమర్శలు చేశారు.