తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు అజయ్(Actor ajay) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు అజయ్.
పాజిటివ్ క్యారెక్టర్లలో మాత్రమే కాకుండా నెగటివ్ క్యారెక్టర్ ల లో కూడా నటించి మెప్పించారు.కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలో తప్పితే ఎటువంటి విషయంలో ఈయన పేరు పెద్దగా సోషల్ మీడియాలో వినిపించదు.
కాగా సినిమా ఇండస్ట్రీలో మీడియాకు దూరంగా ఉండే సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్(ajay).
ఈయన తన పనేదో తాను చేసుకుంటూ ఉంటాడు.సినిమా ఫంక్షన్లకు పిలిస్తే వెళ్తాడు, అందరికంటే ముందు మాట్లాడి సైలెంట్ గా కూర్చుంటాడు.తను ఇంట్రోవర్ట్ అని ఓపెన్ గా చెప్పే ఈ నటుడు, హీరోలతో మాత్రం మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుంటాడు.
తాజాగా అజయ్ మాట్లాడుతూ.తారక్ (Tarak)ఎప్పుడూ నన్ను ప్రిఫర్ చేస్తాడు.
మహేష్ గారు ( mahesh babu)(prabhas)చాలా అవకాశాలు ఇచ్చారు. అతడు, పోకిరి సినిమాల కోసం త్రివిక్రమ్, పూరి జగన్నాధ్(Trivikram, Puri Jagannadh) కు నన్ను పరిచయం చేసింది మహేషే.
అలాగే ప్రభాస్ కూడా చాలా హెల్ప్ చేశాడు.ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు అంతా హీరోలుగా స్టార్ట్ అయినప్పుడు నేను వాళ్ల ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేస్తూ స్టార్ట్ అయ్యాను.
అందుకే వాళ్లతో చాలా క్లోజ్ గా ఉంటాను.
కాకపోతే పైకి నేను పెద్దగా చెప్పుకోను అని తెలిపారు అజయ్(ajay).అజయ్ ఇండస్ట్రీ కొచ్చి అటుఇటుగా పాతికేళ్లు అవుతోంది.ఇప్పటికి సగమే చేశానని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని అంటున్నాడు అజయ్.
ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ రోల్స్ చేసే స్థాయికి ఎదగాలని అన్నారు అజయ్.కొత్త తరం దర్శకులతో వర్క్ చేయాలని ఉందని, వాళ్ల దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉంటుందని తెలిపారు అజయ్.