ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో( AP High Court ) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) పిటీషన్ దాఖలు చేశారు.నంద్యాలలో తనపై నమోదయిన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటీషన్ లో కోరారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈయన తన స్నేహితుడు శిల్పా రవిని( Shilpa Ravi ) కలవడం కోసం నంద్యాల వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.పుష్ప షూటింగ్లో ఉన్నటువంటి ఈయన తిరుపతి నుంచి సరాసరి నంద్యాలకు( Nandyala ) వెళ్లారు.
ఈయన దాదాపు తన స్నేహితుడితో ఒక రెండు మూడు గంటల పాటు సమయం గడిపి తిరిగి వెనుతిరి గారు.
నంద్యాలకు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా వెళ్లినప్పటికీ ఆయన చూడటానికి అభిమానులు భారీ స్థాయిలో అభిమానులు తరలివచ్చారు.అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అల్లు అర్జున్ నంద్యాల రావడంతో నంద్యాల పోలీసులు ఈయనపై కేసు నమోదు చేశారు.అప్పటికే ఎన్నికల ప్రచారానికి కూడా గడువు ముగియడంతో అల్లు అర్జున్ అలాగే శిల్పా రవిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇలా తనపై నమోదు చేసిన ఆ కేసు కొట్టి వేయాలి అంటూ ఈయన పిటిషన్ దాఖలు చేశారు.మరి ఈయన దాఖలు చేసిన ఈ పిటీషన్ పై( Petition ) కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది.ఇక ఈయన నంద్యాల వెళ్లడంతో తన స్నేహితుడు వైకాపా నాయకులకు ఎన్నికలలో మద్దతు తెలపడం కోసమే వెళ్లారని భారీ స్థాయిలో మెగా ఫాన్స్ మెగా ఫ్యామిలీ కూడా తనని విమర్శించారు.అల్లు అర్జున్ నంద్యాల వెళ్లినప్పటి నుంచి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ దూరం పెడితూ వచ్చారు.
ఈ ఘటన తర్వాత పరోక్షంగా మెగా హీరోలు అల్లు అర్జున్ గురించి కౌంటర్లు ఇవ్వడం అల్లు అర్జున్ కూడా మెగా హీరోలకు రీ కౌంటర్ ఇస్తూ చేస్తున్న కామెంట్స్ అభిమానుల మధ్య కూడా చిచ్చు రేపాయి.ఇక ఈ ఘటన తర్వాత మెగా ఫ్యామిలీలో ఎన్నో వేడుకలు జరిగినప్పటికీ అల్లు అర్జున్ , తన ఫ్యామిలీ మాత్రం వేడుకలకు దూరంగా ఉంటున్నారు.