ఎన్నో రకాల ఉద్యమాల ఫలితంగా ఎట్టకేలకు సుమారు రెండు దశాబ్దాల పోరాట పలితంగా ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ సాధించామని,సత్వరమే, మెడికల్ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని మరియు జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనీ స్థానిక పి.డి.
యస్.యూ ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ముందు ధర్నా చేపట్టారుఈ సందర్బంగా పి.డి.యస్.యూ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అజాద్, వెంకటేష్ లు మాట్లాడుతూ….
జిల్లాలో డిగ్రీలు పూర్తి చేసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్, పైచదువుల కొరకు మైళ్ళు వందల కిలోమీటర్ల దూరం దాటిపోవలసిన పరిస్థితి ఉందాని ఆవేదన వ్యక్తం చేశారు.
UGC నిబంధనల ప్రకారం ఒక యూనివర్సిటీ క్రింద రెండు వందల కళాశాలలు లోబడి ఉండాలి.అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 146 డిగ్రీ, 26 పి.జి., 10 బి.ఎడ్, 4 డైట్, 1 లా కళాశాలలు, ఉంటే వీటిలో సుమారు ఏటా 85000 కు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారనీ అందుకే ఖమ్మం జిల్లాకు యూనివర్సిటి, మెడికల్ కళాశాల కావాలి అని రెండు దశాబ్దాలుగా PDSU పోరాడితే మెడికల్ కాలేజ్ సాధించాము అని అలాగే జనరల్ యూనివర్సిటీ కై కూడా పోరాడతామన్నారు ఈ కార్యక్రమం లో పి.డి.యస్.యూ నాయకులు ,సతీష్,కరుణ్,వినయ్, తదితరులు పాల్గొన్నారు….