నల్గొండ జిల్లా మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజాదీవెన సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.ఈ క్రమంలో ప్రగతిభవన్ నుంచి ఆయన కాన్వాయ్ బయలుదేరింది.
నగరంలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో.సీఎం రోడ్డు మార్గంలో మునుగోడుకు వెళ్తున్నారు.
హైదరాబాద్ నుంచి మునుగోడు వరకు ఐదువేలకు పైగా కార్లలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ.సీఎం కాన్వాయ్ ను అనుసరిస్తున్నారు.
మరోవైపు టీఆర్‌ఎస్ ప్రజాదీవెన సభకు మునుగోడులో పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉంది.
అయితే, మరికొద్ది సేపట్లో సీఎం మునుగోడు చేరుకుంటారు.ఇప్పటికే భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు సభాస్థలికి చేరుకుంటున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది.ఈ నేపథ్యంలో సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అదేవిధంగా నియోజకవర్గంపై సీఎం వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని సమాచారం.