టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బొమ్మరిల్లు సినిమాలో హాహా హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయింది.
ఇక ఈ సినిమాలో జెనీలియా చెప్పిన డైలాగ్స్ ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికీ అభిమానులు గుర్తుంచుకున్నారు.కాగా జెనీలియా తెలుగులో బొమ్మరిల్లు,ఢీ, రెడీ, అరెంజ్ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.
ఆ తర్వాత ఈమె బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలతో బిజీ బిజీగా గడుపుతోంది జెనీలియా.
కాగా ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.ఇకపోతే జెనీలియా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అలాగే తన కుమారులు, తన భర్త, తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను పెంచుకుంటూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా జెనీలియా తన పిల్లలు అడిగిన ఒక ప్రశ్నకు జెనీలియా ఎమోషనల్ అయ్యింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి జెనీలియా మామ విలాస్ రావు దేశముఖ్ ఆగస్టు 14, 2012లో మరణించిన విషయం తెలిసిందే.విలాస్ రావు దేశముఖంలో జెనీలియా పప్పా అని కూడా పిలుస్తూ ఉంటుంది.విలాస్ రావుని తలుచుకున్న జెనీలియా సోషల్ మీడియాలో ఈ విధంగా రాసుకొచ్చింది.
పప్పా ఈరోజు రియాల్ రాహేల్ నన్ను ఒక ప్రశ్న అడిగారు.అమ్మ మేము తాతను ఓ ప్రశ్న అడిగితే సమాధానం చెబుతారా అని అడిగారు అని రాసుకు వచ్చింది జెనీలియా.
ఆ ప్రశ్నకు స్పందించిన జెనీలియా స్పందించిన జెనీలియా అవును.మీరు వినగలిగితే ఆయన సమాధానం చెబుతారు అని చెప్పిందట.
ఇన్నేళ్లు నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెబుతూనే ఉన్నారు.నేను వింటూనే ఉన్నాను.
మాకు ఏదైనా క్లిష్టమైన అయిన పరిస్థితి వస్తే మీరు అండగా ఉంటూ వస్తున్నారు.మా కోసం ఎప్పుడూ ఉంటానని మాట ఇచ్చారు.
మా చెవులను ఓపెన్ చేసి మా కళ్ళు తెరిచి మీ మాటలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాం వీ మిస్ యు పప్పా అని జెనీలియా రాసకొచ్చింది.