సోషల్ మీడియాలో పిల్లలకి సంబంధించి వైరల్ అయ్యే వీడియోలు మనుషులను హత్తుకుంటాయి.ఈ వీడియోలో వారి అమాయకత్వం చూస్తే ఎవరైనా సరే ముచ్చట పడిపోవాల్సిందే.
తాజాగా అలాంటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక కుర్చీలో చిన్నపిల్లాడు కూర్చొని ఉండటం చూడవచ్చు.
అతడి చేతిలో ఒక బీర్ బాటిల్ ఉంది.ఆ తర్వాత ఆ పిల్లోడు అటూ ఇటూ రెండు వైపులా చూసి తనని ఎవరూ చూడడం లేదని నిర్ధారించుకున్నాడు.
ఆ తర్వాత బీర్ బాటిల్ ఓపెన్ చేసి దాన్ని తాగడం మొదలు పెట్టాడు.ఒక గుక్కెడు బీరు తాగి ఎవరైనా వస్తున్నారో లేదో చూసుకుంటున్నాడు.
మళ్ళీ ఇంకొక సిప్ తీసుకుంటూ తన చుట్టుపక్కల చెక్ చేసుకున్నాడు.
అయితే తన తల్లిదండ్రులు ఒక కిటికీ నుంచి తనని గమనిస్తూనే ఉన్నారని చివరికి తెలుసుకున్నాడు దాంతో ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ బీర్ బాటిల్ కింద పెట్టేస్తాడు.
ఆ తర్వాత ఏమీ తెలియనట్టు మమ్మీ అంటూ కుర్చీలో నుండి పైకి లేచాడు.అయితే బీరు బాగా ఎక్కినట్టుంది అందుకే వెంటనే అతడు తూలి కింద పడ్డాడు.
దాంతో తల్లి బాగా నవ్వుతూ అతడి అమాయకత్వానికి ముచ్చట పడింది.ఈ దృశ్యాలను తన కెమెరాలో బంధించి లాడ్ బైబిల్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీకి షేర్ చేసింది.
దానిని లాడ్ బైబిల్ పేజ్ అందరికీ షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.దీనికి ఇప్పటికే రెండు లక్షల వరకు లైకులు, మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.
మీరు కూడా ఈ ఫన్నీ వీడియో పై ఓ లుక్కేయండి.