పేపర్ బ్యాలెట్ కు బదులుగా ఈవీఎం మెషిన్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి వాటి పని తీరుపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈవీఎంల వల్ల ఏ పార్టీకి ఓటేసినా అధికార పార్టీ.
మరో పార్టీకి వెళ్లిపోతున్నాయని ఇప్పటికే ప్రాంతీయ పార్టీల అధినేతలు.ఇతరులు ఆరోపణలు చేశారు.
ఈవీఎంలను మానిప్యులేట్ చేయడానికి ఆస్కారం ఉంటుందని.నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారని ఆరోపించాయి.
అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది.ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది.
ఈవీఎం మెషిన్లను ట్యాంపర్ చేయడం మానిప్యులేట్ చేయడం వంటివి కుదరదని.కావాలంటే ఏ సాంకేతిక నిపుణుడినైనా తెచ్చుకుని నిరూపించాలని సవాల్ కూడా చేసింది.
గత ఎన్నికల్లో చంద్రబాబు
గత సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో పలు పార్టీల అధినేతలు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.ఈవీఎంలను కాకుండా వీవీ ప్యాట్స్ ని లెక్కించాలని డిమాండ్ చేశారు.
వీవీ ప్యాట్స్ స్లిప్పులు.ఈవీఎంలో లెక్కలు సమానంగా లేకుంటే మొత్తం లెక్కించాలని కూడా డిమాండ్ చేశారు.కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ముందు వీవీప్యాట్స్ స్లిప్పులను లెక్కించాలని.అవి పూర్తయిన తర్వాతనే ఈవీఎంలను లెక్కించాలని డిమాండ్ చేశారు.అయితే ఎన్నికల సంఘం వారి డిమాండ్ పట్టించుకోలేదు.
ఇప్పుడు కేసీఆర్ ఆదే బాటలో
ఇక గులాబీ బాస్ సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు.ఈ క్రమంలోనే కేసీఆర్ కూడా ఇప్పుడు ఈవీఎంలపై పోరు చేయనున్నారని చెబుతున్నారు.చంద్రబాబు మాదిరిగానే ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంలో చంద్రబాబు మాదిరిగానే కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీల మద్దతును కేసీఆర్ కూడగట్టబోతున్నారని తెలుస్తోంది.
అయితే ఓడిపోతాననే భయం వల్లే కేసీఆర్ ఈవీఎంలపైకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
గతంలో ఉత్తరప్రదేశ్లో బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ సమాజ్ వాదీ పార్టీతోపాటు పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ ఇతర పార్టీలు కూడా ఈవీఎంలను బీజేపీ మానిప్యులేట్ చేసిందని తీవ్ర విమర్శలు చేశాయని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే బీజేపీపై ప్రజల తిరుగుబాటుకు ఇది నిదర్శనమని.
మతతత్వ రాజకీయాలకు చెంపపెట్టని ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.అలా కాకుండా ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంల వల్లే బీజేపీ గెలిచిందంటూ నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈవీఎంలపై పోరుకు సై అంటుండగా ఏమేరకు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే…
.