నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది.ఎగువ నుండి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 26 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు.
ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3,23,833 క్యూసెక్కులుండగా, అవుట్ ఫ్లో 4,03,972 క్యూసెక్కుల నీరు ఉంది.సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 585.60 అడుగులుగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.అదేవిధంగా ప్రాజెక్టులో ప్రస్తుతం 299.16 టీఎంసీల నీటి నిల్వ ఉంది.