జీవితం అందరికీ అన్ని నేర్పిస్తుంది జీవించాలనే కోరికను చూపిస్తుంది.అలాగే ఒంటరిగా ఉన్న జీవితంలో కష్టాలను చూపిస్తుంది.
కష్టాల కడలి ఈది గెలిచిన వాడే విజేత అవుతాడు కానీ ఒక్కోసారి మధ్యలోనే బోర్లా పడతారు.ఎందుకు జీవితాన్ని కోల్పోతున్నామో తెలియకుండానే కనీసం ఎవరితో తమ బాధను పంచుకోకుండానే తమ జీవితాలను ముగించేసుకుంటారు.
సామాన్యుల జీవితాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది అనుకుంటే పొరపాటే ఎంతో స్టార్ట్ డం చూసి వందల, వేల మంది అభిమానులను సొంతం చేసుకున్న వారు కూడా ఒంటరితనం భరించలేక కన్నుమూస్తూ ఉంటారు.
అందుకు ఖచ్చితంగా చెప్పాల్సిన ఉదాహరణ విషయానికొస్తే నటుడు రంగనాథ్ గారి గురించే చెప్పుకోవాలి.
ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక విలక్షణ నటుడు.రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్ గా పని చేస్తూ వెండి తెరకు పరిచయమయ్యాడు ఏకంగా 300 కు పైగా సినిమాల్లో నటించాడు.
హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులతో నిరాజనాలను అందుకున్నాడు.ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు మంచి రచయిత కూడా.
ఆయన రచించిన సుదర్శనం, అంతరంగ మధనం, పధపరిమళం, అక్షర సాక్ష్యం, రంగనాథ్ కథలు, రంగనాథ్ నడత పుస్తకాలు, ఈ చీకటి తొలగాలి అనే రచనలు అక్షర రూపం దాల్చాయి.ఇక ఆయన సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లోను నటించాడు.
కానీ 2015 లో ఆయన అకాల మరణం చెందాడు.
వాస్తవానికి ఉదయ్ కిరణ్ చనిపోయాడు అన్న విషయం తెలుసుకున్న రంగనాథ్ ఆయనతో గంట సమయం మాట్లాడే ఉండి ఉంటే ఖచ్చితంగా ఆత్మహత్య ఆలోచనల నుంచి తప్పించే వాడినట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.కానీ దురదృష్టవశాత్తు రంగనాథ్ కూడా ఆత్మహత్య చేసుకునే చనిపోయాడు.తొలుత రైలు కిందపడి చనిపోవాలనుకున్నట్టు, కానీ రైలు ఆలస్యం కావడంతో మనసు మార్చుకున్నట్టు చెప్పాడు.
ఉదయ్ కిరణ్ చేసిన పిచ్చి పనిని తప్పుపట్టిన రంగనాథ్ 2015లో అర్ధాంతరంగా ఉరిపోసుకొని చనిపోయాడు.దానికి పూర్తిగా ఆయన ఒంటరితనమే కారణమని చెప్పుకోవచ్చు.ఆయన భార్య చనిపోవడంతో ఒంటరిగా బతకడం ఇష్టం లేక కన్నుమూశాడు.
వాస్తవానికి ఆయన భార్య ప్రమాదవశాత్తు బాల్కనీ పైనుంచి కింద పడిపోయి ఏకంగా 14 సంవత్సరాల పాటు మంచానికే పరిమితమైంది.ఆమెను కన్న బిడ్డలా చూసుకొని అన్ని సపర్యలు చేశాడు.కానీ ఏనాడు తన విషయాలను బయటకు చెప్పుకునే వాడు కాదు.
ఆమె 2009లో కన్ను మూయడంతో ఆమె లేని లోటును రంగనాథ్ తట్టుకోలేకపోయాడు.ఆరేళ్ల తర్వాత ఆ 2015లో గోడపై తన ఎందుకు చనిపోతున్నాడో చెప్పి మరి కన్నుమూశాడు.
ఇలా ఒకరికి జీవితం విలువ తెలియజేసిన రంగనాథ్ తన జీవితానికి ఒంటరితనాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో కన్నుమూయడం సినిమా ఇండస్ట్రీని ఎంతగానో కన్నీటి సంద్రంలో ముంచివేసింది
.