అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా తనలో ఉన్న మాస్ లుక్ బయటపెట్టిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఒక యాడ్ కోసం తన లుక్ పూర్తిగా మార్చేశారు.చెవికి పోగులు పెట్టుకొని సైడ్ హెయిర్ స్టైల్ కట్, నోట్లో సిగరెట్ పెట్టుకుని ఉన్నటువంటి అల్లు అర్జున్ లుక్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ లుక్ చూసిన అభిమానులు అల్లు అర్జునేనా అనే సందిగ్ధంలో పడ్డారు.మొత్తానికి అల్లు అర్జున్ విభిన్నమైన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ విధంగా అల్లు అర్జున్ తన లుక్ మొత్తం మార్చుకోవడంతో ఈ లుక్ పుష్ప సినిమా కోసం అని అందరూ భావించారు.అయితే అల్లు అర్జున్ సినిమా కోసం కాకుండా ఒక యాడ్ కోసం ఇలాంటి లుక్ ట్రై చేశారు.
ఇకపోతే అల్లు అర్జున్ ఈ స్టైలిష్ లుక్ పై నటి రష్మిక స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా రష్మిక ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.ఈ ఫోటోలో ఉన్నది మీరేనని క్షణకాలం పాటు గుర్తించలేకపోయాను అల్లు అర్జున్ సార్ అంటూ రష్మిక ట్వీట్ చేశారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ లుక్ గురించి రష్మిక చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.ఇకపోతే రష్మిక అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి క్రేజ్ అందుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక పాత్రలో మెప్పించిన ఈ ముద్దుగుమ్మకు పాన్ ఇండియా స్థాయిలో మంచి మార్కులు పడ్డాయి.
ఇకపోతే పుష్ప సినిమా సీక్వెల్ చిత్రం ద్వారా వీరిద్దరూ ఎలా ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.