ఆన్‌లైన్ నేర సమీక్షలో భాగంగా పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఏస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి

నిర్దిష్టమైన ప్రణాళిక, సమిష్టి కృషితో పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించారని రాష్ట్ర డీజీపీ యం.మహేందర్ రెడ్డి గారు అన్నారు.

 Dgp Mahender Reddy Video Conferrence With Police Commissioners And State Sps Det-TeluguStop.com

నెలవారీ ఆన్‌లైన్ నేర సమీక్షలో భాగంగా గురువారం పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఏస్పీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ గారు పాల్గొన్నారు.పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీజీపీ గారు మాట్లాడుతూ… కొత్తగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ , పోక్సో , ఎస్సీ ఎస్టీ కేసులపై పోలీస్ అధికారులు ప్రత్యేక చోరవ తీసుకొని అయ కేసుల్లో నేరానికి సంబంధించి ఆధారాలు సేకరించి నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో పోలీస్ అధికారులు ఉత్తమ పనితీరు కనబరిచారని స్పష్టం చేశారు.

నేర పరిశోధన,కేసుల దర్యాప్తు, నిందుతుల అరెస్ట్, చార్జ్ షీట్ సమయంలో మరింత నాణ్యత ప్రమాణాలు పాటించేలా పై అధికారులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు.నేర నిరూపణలో కీలక పాత్ర పోషించే దర్యాప్తు అధికారి ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌, ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ వుండాలని అన్నారు.

కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సమన్వయం చేసుకుంటూ.సాక్ష్యాలను సకాలంలో న్యాయస్థానంలో ప్రవేశపెట్టి నిందితులకు శిక్ష పడేలా చేయాలని సూచించారు.

షీటీమ్, HRMS, సైబర్ నేరాలపై పోలీస్ అధికారులు తరచూ రివ్యూ నిర్వహించాలని సూచించారు.ఏ పోలీస్ స్టేషన్ కెళ్లిన ఒకేవిధమైన స్పందన, ఏకీకృత సేవలు అందుస్తూ పారదర్శకతను విస్తరింపజేయడం లక్ష్యంగా అమలవుతున్న ఫంక్షనల్ వర్టికల్స్ అమలు తీరును సమీక్షించారు.

సమావేశంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ శబరిష్,అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ ,AR అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు రామోజీ రమేష్, వెంకటస్వామి, అంజనేయులు, రహెమాన్, రవి, బాబురావు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube