కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీల్లో చేర్చాలి అంటూ ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు ఉద్యమం జరిగింది.
చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటూ చాలా కాలం పాటు ఏపీలో కాపులంతా ఏకమై ముద్రగడ ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు.చివరకు తునిలో రైలు దహనం వరకు ఈ ఉద్యమం వెళ్ళింది.
అయినా ముద్రగడ ఉద్యమాన్నిపట్టించుకోకుండా ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించింది.దీంతో ముద్రగడ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంది.
ఇక ఎన్నికల సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తానని చంద్రబాబు మాదిరిగా హామీ ఇవ్వలేను అంటూ జగన్ ప్రకటించినా, 2019 ఎన్నికల్లో కాపులు మెజారిటీ శాతం వైసిపి వైపే చూశారు.
ఇక వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముద్రగడ పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
అప్పుడప్పుడు వివిధ సమస్యలపై ముఖ్యమంత్రి కి లేఖలు రాస్తూ వస్తున్నారు తప్పించి, రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ఆయన ప్రయత్నించడం లేదు.ఆయన సైలెంట్ గా ఉన్నా, యాక్టివ్ గా ఉన్న వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తూనే ఉన్నాయి.
ఇది ఎలా ఉంటే ప్రస్తుతం ముద్రగడ వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.ఆయన వైసిపి ప్రభుత్వ తీరు పైనా, జగన్ వ్యవహార శైలి పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆయన టిడిపిలో కానీ జనసేనలో కానీ చేరాలనే ఆలోచనతో ఉన్నట్లుగా ఇప్పుడు ప్రచారం ఉధృతమైంది.దీని తగ్గట్లుగానే ముద్రగడ ప్రధాన అనుచరుడు ఏసుబాబు ను టిడిపిలో చేర్చేందుకు ప్రయత్నిస్తుండడంతో, ముద్రగడ ఆదేశాలతోనే ఆయన టిడిపిలోకి వెళ్తున్నారని, ముందుగా అనుచరులు అందర్నీ చేర్పించి ఆ తరువాత ఆయన చేరుతారని ప్రచారం జరుగుతుండగా, ముద్రగడ కు టిడిపిలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని, ఆయన జనసేనలోకి మాత్రమే వెళ్తారని కాపు రిజర్వేషన్ అంశంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని అందుకే జనసేన పార్టీలో చేరాలని ఈ మేరకు అనుచరుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుండడంతో ఆయన చూపు జనసేన వైపు ఉందనే ప్రచారం జరుగుతోంది.అయితే తన అంతరంగం ఏమిటనేది ముద్రగడ మాత్రం బయట పెట్టడం లేదు.కానీ వైసీపీ విషయంలో మాత్రం ఆయనలో తీవ్ర అసంతృప్తి ఉందనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట.