ఫస్ట్‌ టైమ్‌ దిల్ రాజు వల్ల వెయ్యి దాటేసిన నాగచైతన్య

ఒక హీరో స్టార్‌ డమ్‌ ఆయన సినిమా లు సాధించిన వసూళ్ల ను బట్టి ఉంటుంది.ఆ హీరో సినిమా లు విడుదల అయిన థియేటర్ల సంఖ్య ఆధారం గా ఉంటుంది.

 Naga Chaitanya Thank You Produecr Dil Raju Releasing 1000+ Theaters , Dil Raju-TeluguStop.com

స్టార్‌ హీరోలకు మాత్రమే సాధ్యం అయిన వెయ్యి థియేటర్ల సంఖ్య ను నాగ చైతన్య సాధించాడు.థాంక్యూ సినిమా ను తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు గా 1150 స్క్రీన్స్ లో విడుదల కాబోతుందట.

ఈ ఘనతను మొదటి సారి నాగ చైతన్య దక్కించుకున్నాడు.హీరోగా ఇప్పటి వరకు ఈయన సాధించిన సూపర్ హిట్ లు తక్కువే అయినా కూడా సినిమా సినిమా కు స్థాయిని పెంచుకుంటూ వచ్చాడు.

మినిమం గ్యారెంటీ సక్సెస్ హీరో అన్నట్లుగా పేరు దక్కించుకున్నాడు.హీరోగా నాగ చైతన్య తాజాగా చేసిన థాంక్యూ సినిమా పై కూడా అంచనాలు ఉన్నాయి.

థాంక్యూ సినిమా ను తప్పకుండా జనాలు ఆధరిస్తారు అనే నమ్మకం తో ప్రేక్షకులు ఉన్నారు.కనుక దిల్‌ రాజు ఈ సినిమా ను కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టి ఏకంగా వెయ్యికి మించిన స్క్రీన్స్‌ లో విడుదల చేసేందుకు సిద్దం అయ్యాడు.

మొదటి వారం రోజులు వెయ్యి థియేటర్లలో మినిమం గా ఆడినా కూడా 40 నుండి 45 కోట్ల వసూళ్లు నమోదు అవుతాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియా లో సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

ఈ సమయంలోనే దిల్‌ రాజు వల్ల నాగ చైతన్య వెయ్యి దాటేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.నాగ చైతన్య గత చిత్రాలు సక్సెస్ అవ్వడం వల్ల కూడా ఈ సినిమా కు భారీ రిలీజ్ దక్కిందని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు.

 మరి ఈ సినిమా ఆ స్థాయి వసూళ్లు సాధిస్తుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube