శ్రీలంకలో ఆందోళన విరమణకు నిరసనకారుల నేతలు అంగీకరించారు.తక్షణం కొలంబోలోని అధికారిక కార్యాలయాల నుంచి వెనక్కి వెళ్తామని తెలిపారు.
అధ్యక్ష భవనంతోపాటు సెక్రటేరియట్, ప్రధాని కార్యాలయం నుంచి వెనక్కి వెళ్తున్నట్లు వెల్లడించారు.అయితే శాంతియుతంగా తమ ఆందోళన కొనసాగిస్తామని నిరసనకారులకు నాయకత్వం వహిస్తున్నవారు తెలిపారు.
అధ్యక్షుడు గోటబయ రాజపక్సతోపాటు ప్రధాని విక్రమసింఘే రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.రాజీనామా లేఖ పంపిస్తానన్న గోటబయ మరోసారి మాట తప్పారు.ప్రధాని పదవికి రాజీనామా చేస్తానన్న విక్రమసింఘే కూడా నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారు.ఆపద్ధర్మ అధ్యక్షుడిగా కొత్త అవతారమెత్తి అధికారం చెలాయించాలని చూస్తున్నారు.
ఇప్పటికే దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు విక్రమసింఘే ప్రకటించగా ఆందోళనకారులు పట్టించుకోలేదు.వారిద్దరి అధికారిక కార్యాలయాలను ఆక్రమించి హల్ ఛల్ సృష్టించారు.
మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స మాల్దీవుల నుంచి కూడా పరారయ్యారు.తన కుటుంబంతో సహా ఆయన సింగపూర్ చేరుకున్నారు.సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆయన సింగపూర్ చేరుకున్నారు.అయితే, గోటబయ తమను ఆశ్రయం కోరలేదని, ప్రైవేట్ పర్యటనలో భాగంగా వచ్చారని సింగపూర్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడ్డది.మరోసారి కొలంబో వీధులు రణరంగాన్ని తలపిస్తున్నాయి.అయితే, ప్రజల ఆందోళనల పట్ల కఠినంగా వ్యవహరించబోమన్న సైన్యం మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది.ఆందోళన విరమణకు నిరసనకారుల నేతలు అంగీకరించారు.
అయితే శాంతియుతంగా తమ ఆందోళన కొనసాగిస్తామని నిరసనకారులకు నాయకత్వం వహిస్తున్నవారు తెలిపారు.
శ్రీలంకలో ఆందోళన విరమణ చేయనున్నట్లు నిరసనకారులు తెలిపారు.కొలంబోను ఆందోళనకారులు వీడనున్నారు.అయితే శాంతియుత నిరసన కొనసాగిస్తామని వారు వెల్లడించారు.
మాల్దీవుల్లోనూ గోటబయకు నిరసన సెగతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స కుటుంబంతోసహా సింగపూర్ కు మకాం వేశారు.ప్రైవేట్ పర్యటనకే సింగపూర్ అధికారులు పరిమితమన్నారు.