కుండపోతగా కురుస్తున్న వర్షాలు, వరదలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంతర్గాం మండల జడ్పీటీసీ ఆముల నారాయణ అన్నారు.ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి దిగువకు భారీగా వరద నీరు వదులుతుండడంతో మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి పరిశీలించి ప్రాజెక్టు అధికారులను పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శిథిలావస్థలో ఉన్నవారు ఇండ్లలో ఎవ్వరూ ఉండవద్దని కోరారు.
నది తీరం లోతట్టు ప్రాంతాల ప్రజలు నది వైపుకు వెళ్ళరాదని సూచించారు.అన్ని రహదారులు వంతెనలపై నీటి వరద పొంగి ప్రవహించే ప్రమాదం ఉన్నందున ప్రజలు వాహన రాకపోకలు, ప్రయాణాలు మానుకోవాలని కోరారు.
నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ప్రాజెక్టు సందర్శనలో జడ్పీటీసీ అంతర్గాం మండల వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు గుమ్ముల రవీందర్, బాదరవేణి స్వామి, తాహాసిల్థార్ కె.వేణుగోపాల్, ఎంపీడీఓ భూక్యా యాదగిరి నాయక్, అంతర్గాం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భానోతు తిరుపతి నాయక్, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.