ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అమెరికా పర్యటనలో ఉన్నారు.అమెరికన్ తెలుగు అసోసియేషన్ 17వ మహాసభలు వాషింగ్టన్ డీసీలో జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ఆటా నిర్వహిస్తున్న వేడుకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ను ఆమె ప్రారంభించారు.
ఆటా మహాసభల్లో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేయడం గర్వకారణంగా ఉందని కవిత అభిప్రాయపడ్డారు.
పాతికేళ్ల నుంచి విదేశాలకు వెళ్లే తెలుగువారి సంఖ్య బాగా పెరిగింది.
ముఖ్యంగా 1997 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది.అప్పటి తెలుగుదేశం పార్టీ ఐటీ రంగానికి రెక్కలు తొడగడంతో అప్పటి నుంచి అందరూ రెక్కలు కట్టుకుని విదేశాలకు వాలిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అమెరికాలో పెరిగిపోతున్న తెలుగు వారికి తగ్గట్లే వారికి సంబంధించిన అసోసియేషన్లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.వాటిల్లో ఒకటి ఆటా.అయితే ఆటాకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సరికొత్త నిర్వచనం ఇచ్చారు.ఆటా అంటే ఆంధ్రా తెలంగాణ అసోసియేషన్ అని కవిత అన్నారు.
అంతేకాకుండా ఎన్టీఆర్‌ను కవిత గుర్తుచేసుకోవడం కూడా రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.ఒకప్పుడు భారతదేశంలో తెలుగువారికి ఎన్టీ రామారావు గుర్తింపు తెచ్చారని.తెలంగాణ ప్రజలకు దేశంలో కేసీఆర్ గుర్తింపు తెచ్చారని కవిత అన్నారు.

అలాగే అమెరికాలో తెలుగువారికి ఆటా గుర్తింపు తెచ్చిందని ప్రశంసించారు.మహా సభల ద్వారా తెలుగు సంస్కృతిని భవిష్యత్ తరాలకు చెప్పేందుకు ఆటా పెద్దలు కృషి చేశారని కొనియాడారు.
భారతదేశం గర్వించేదగ్గ స్థాయికి అమెరికాలోని తెలుగువారు ఎదిగారని.
తానా, ఆటాలకు అమెరికాలోని ఏదైనా ఒక నగరంలో హెడ్‌క్వార్టర్ ఏర్పాటు చేసి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఓ మ్యూజియం ఏర్పాటుచేయాలని కవిత సూచించారు.మాల్దీవులు, మారిషస్‌లో ఉన్న తెలుగువాళ్లు.
తెలుగుభాష, సంస్కృతిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు తెలుగు యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.అదేవిధంగా ఆటాకు కూడా రాష్ట్రప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుందన్నారు.