నాచురల్ బ్యూటీ సాయి పల్లవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే తెలుగులో లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలతో హిట్ సొంతం చేసుకున్న సాయి పల్లవి తాజాగా విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా కలెక్షన్ల పరంగా పెద్దగా రాబట్ట లేకపోయినా, ఇందులో సాయి పల్లవి నటించిన వెన్నెల పాత్రకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.
తాజాగా సాయి పల్లవి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో గార్గి అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించారు.ఈ సినిమా తెలుగు తమిళ కన్నడ భాషలలో జులై 15వ తేదీ విడుదల కానుంది.
లేడీ ఓరియంటెడ్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఓ మహిళ జర్నీని ఆమె ఎదుర్కొని ఇబ్బందులను ఆవిష్కరించేలా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.
సాయి పల్లవి నటించిన ఈ సినిమాని తమిళంలో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక విడుదల చేస్తున్నారు.సాయి పల్లవి మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తనకు అచ్చ తెలుగు అమ్మాయిల తెలుగు రాష్ట్రాలలో కూడా ఎంతో మంచి క్రేజ్ ఉంది.అయితే తెలుగులో ఈమె నటనకు ఫిదా అయినటువంటి డైరెక్టర్ సుకుమార్ ఏకంగా లేడీ పవర్ స్టార్ అనే బిరుదును ఇచ్చారు.ఈ క్రమంలోనే సాయి పల్లవి వేదికపైకి వచ్చిందంటే అభిమానుల సైతం లేడీ పవర్ స్టార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.