ఈమధ్య సోషల్ మీడియా ప్రతి ఒక్కరిని స్టార్లుగా మార్చేస్తుంది.ముఖ్యంగా సెలబ్రెటీల వారసులకు మాత్రం అతి తక్కువ సమయంలో మంచి ఫాలోయింగ్ ను అందిస్తుంది.
ఇప్పటికే యాంకర్ రవి కూతురు, శేఖర్ మాస్టర్ కూతురు, రోజా కూతురు ఇలా పలువురు వారసులు సోషల్ మీడియాను బాగా ఏలేస్తున్నారు.ఇక మరో ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు కూడా సోషల్ మీడియాని బాగా షేక్ చేస్తుంది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి గురించి అందరికీ పరిచయమే.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో మెప్పిస్తుంది.
ఇక సురేఖ వాణి ప్రస్తుతం మాత్రం గ్లామర్ హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.గత కొంత కాలం నుండి సురేఖ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారిన సంగతి తెలిసిందే.
అందులో తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.ఈమెకు తనెత్తు కూతురు సుప్రీత ఉన్న సంగతి తెలిసిందే.సుప్రీత తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది.ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది.ఇక తల్లి సురేఖవాణి తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.
ఇక ఈమె సురేఖ వాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.

చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన తల్లితో బాగా స్టెప్ లు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది.అప్పుడప్పుడు తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.
ఇక నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించదు.అప్పుడప్పుడు లైవ్ లోనే బూతు మాటలు తిట్టేస్తుంది ఈ హాట్ బ్యూటీ.
అయినా కూడా ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే.ఎందుకంటే తన హాట్ హాట్ లుక్ లతో వారి హృదయాలలో గుడి కట్టేసుకుంది.ఇక సుప్రీత కూడా వెండితెరపై అడుగుపెట్టింది.‘లేచింది మహిళా లోకం‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక సుప్రీత నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా హల్ చల్ చేస్తోంది.

నిజానికి ఈ బ్యూటీ ఇంట్లో కంటే నెట్టింట్లో ఎక్కువ సమయాన్ని గడుపుతుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక స్టోరీ పంచుకుంది.ఇందులో తన కాలికి రోజా పువ్వు టాటూ వేయించుకుంది.
ఇక ఆ స్టోరీకి. రొమాన్స్ ఇంక్డ్ అంటూ పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది.
దాంతో నెటిజన్లు ఆ పోస్ట్ ని చూసి తెగ లైకులతో పాటు కామెంట్లు కూడా పెడుతున్నారు.