హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ట్రస్ట్ సెంట్రలైజెడ్ కిచెన్ ను ప్రారంబించిన మంత్రి హరీశ్ రావు..

రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండల్: హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ట్రస్ట్ నార్సింగిలో ఏర్పాటు చేసిన సెంట్రలైజెడ్ కిచెన్ ను ప్రారంబించిన మంత్రి హరీశ్ రావు. మంత్రి కామెంట్స్… జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు 5 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని చారిత్రక ఉస్మానియా ఆసుపత్రి వేదికగా గత నెలలో ప్రారంభించుకున్నము.

 Minister Harish Rao Inaugurated Hare Krishna Movement Charitable Trust Centralis-TeluguStop.com

ఆసుపత్రుల్లో భోజనం అందించేందుకు హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ట్రస్ట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంట్రలైజెడ్ కిచెన్ ను ఇక్కడ ప్రారంభించుకున్నం.భోజనామృతం, అన్నపూర్ణ, సద్దిమూట… ఇలా పేరు ఏదైనా, హరే రామతో కలిసి ప్రభుత్వం లక్షల మంది ఆకలి తీర్చడం జరుగుతున్నది.18 దవాఖానలకు అన్ని జిల్లాల నుంచి చికిత్స కోసం పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు.ఒక రోగి వెంట ఒకరో ఇద్దరో సహాయకులు కూడా వస్తారు.

సర్జరీలు జరిగినప్పుడు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు చికిత్స కోసం రోగులు, వారి అటెండెంట్స్ రోజుల తరబడి ఉండాల్సిన పరిస్థితి.రోగులకు ప్రభత్వమే ఉచితంగా పోషకాహారం అందిస్తోంది.

కానీ వారికి తోడుగా వచ్చేవారు మాత్రం ఆకలికి అలమటిస్తున్నారు.కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరడమే ఒక నరకమంటే.

ఆకలితో పడుకోవడం ఇంకో నరకం.

ఇలా రోగుల సహాయకులు మానసికంగా, శారీరకంగా అవస్థలు పడడాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తించారు.

రోగుల సహాయకుల కోసం ఇప్పటికే నైట్ షెల్టర్లు నిర్మించారు.తాగు నీటి వసతి కల్పించారు.

అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఒక పూట ఆకలిని తీరుస్తున్నాయి.అయినా వారు అర్ధాకలితో ఉంటున్నారని సీఎం కేసీఆర్ గారు గ్రహించారు.

మానవత్వంతో ఆలోచించి రోగుల సహాయకులకు 5 రూపాయలకే మూడు పూటలా కడుపు నిండా భోజనం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.బడ్జెట్ లో చెప్పినట్లు అమలు చేశారు.18 ఆసుపత్రుల్లో రోజు సుమారు 20 వేల మందికి లబ్ది చేకూరుతుంది.ఒక్కో ప్లేట్ భోజనానికి ప్రభుత్వం 21 రూపాయలు సబ్సిడీ ఇస్తోంది.జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 దవాఖానల్లో భోజనం కోసం ప్రభుత్వం ఏటా 38.66 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.భోజనం తినడానికి అవసరమైన నీటి సదుపాయం, షెల్టర్స్‌, ఫ్యాన్లు వంటివి టీఎస్‌ఎండీసీ ఏర్పాటు చేసింది.ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు ఉత్తమ చికిత్సతో పాటు పోషకాహారాన్ని అందించాలనీ సీఎం కేసీఆర్ గారు నిర్ణయించారు.

డైట్‌ ఛార్జీలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Telugu Kitchen, Cm Kcr, Harekrishna, Harish Rao, Narsingi, Trs-Political

టీ.బి., క్యాన్సర్‌ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం కోసం బెడ్‌ ఒక్కంటికి ఇచ్చే డైట్ ఛార్జీలను 56 రూపాయలనుంచి 112 రూపాయలకు పెంచాం.సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలు బెడ్ ఒక్కంటికి 40 రూపాయలనుంచి 80 రూపాయలకు పెంచాం.దీని కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 43.5కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది.పారిశుధ్యకార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు బడ్జెట్ లో ప్రభుత్వం బెడ్ ఒక్కంటికి చేసే పారిశుద్ద్య ఖర్చును 5000 నుంచి 7500 రూపాయలకు పెంచింది.ఇందు కోసం ప్రభుత్వం 338 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం వెచ్చించనుంది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉత్తమ వైద్య చికిత్స అందించేందుకు పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేస్తూ అత్యాధునిక వైద్య పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.ఈ వైద్య ప‌రిక‌రాల నిర్వ‌హ‌ణ‌ కోసం దేశంలోనే తొలిసారిగా “బ‌యో మెడిక‌ల్ ఎక్విప్‌మెంట్ మెయింట‌నెన్స్” పేరుతో పాల‌సీ అమలు చేస్తున్నాం.

Telugu Kitchen, Cm Kcr, Harekrishna, Harish Rao, Narsingi, Trs-Political

హైద‌రాబాద్ జ‌నాభా, రాష్ట్ర జ‌నాభా ఏటా పెరుగుతూ వ‌స్తున్నా, అందుకు త‌గిన‌ట్లుగా వైద్య స‌దుపాయాల క‌ల్ప‌న‌పై ఏనాడు నాటి ప్ర‌భుత్వాలు దృష్టి సారించ‌లేదు.దీంతో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుప‌త్రుల‌పై తీవ్ర‌ ఒత్తిడి పెరిగింది.ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు న‌గ‌రం న‌లువైపులా నాలుగు టిమ్స్ ఆసుప‌త్రులు ఏర్పాటు చేయాల‌నే చారిత్ర‌క నిర్ణ‌యం తీసుకున్నారు.దీంతో ఇక్క‌డి ఆసుప‌త్రుల‌పై ఒత్తిడి త‌గ్గించ‌డంతో పాటు, రోగుల‌కు ఎక్క‌డిక్క‌డ సూప‌ర్ స్పెషాలిటీ సేవ‌లు అంద‌నున్నాయి.రూ.2,679 కోట్ల‌తో నిర్మించ‌నున్న 3 సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాప‌న చేశారు.ఒకవైపు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులను బలోపేతం చేస్తూనే.మరో వైపు కొత్త ఆసుపత్రుల నిర్మాణం ప్రభుత్వం చేస్తున్నది.పేదలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక చర్యలు తీసుకుంటున్నారు ఇవి విజయవంతం కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు అవార్డులు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube