బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ కొన్ని రోజుల నుంచి వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు.కాస్తా విషయ పరిజ్ఞానంతో మాట్లాడతుండటంతో హైలైట్ అవుతున్నారు.
ఇటీవల జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో రఘునందన్ తీరు అందరినీ ఆలోచింపచేసిందనే చెప్పాలి.పార్టీ నుంచి అంతగా మద్దతు లేకపోయినప్పటికీ బలంగా కొట్లాడారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.ఈ నేపథ్యలోనే నిందితులపై చర్యలు తీసుకున్నారన్న వాదన కూడా ఉంది.
అయితే ఆ మధ్య బీజేపీలో తనకు అంతగా ప్రాధాన్యం ఇస్తలేరనే వార్తలు కూడా వినిపించాయి.బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యలోనే బీజేపీ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది.ఈటీవల ఈటలకు ఢిల్లీ నుంచి పిలపురావడంతో బయలుదేరివెళ్లారు.
హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.ఈ నేపథ్యంలోనే అయనకు తెలంగాణ బీజేపీలో కీలక బాధ్యతలు అప్పగించనుననట్లు తెలుస్తోంది.
అలాగే దుబ్బాక ఉప ఎన్నికతో తన సత్తా చాటిన రఘునందన్ కు కూడా పార్టీలో సముచిత స్థానం కల్పించడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం.అయితే ఇలాంటి ఫైర్ ఉన్న లీడర్లకే రాష్ట్ర చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే సమర్థవంతంగా పనిచేస్తారని పలువురు విశ్లేషకులు అంటున్న మాట.
అయితే అధిష్టానం ఆదేశిస్తే గజ్వేల్ నుంచి పోటీ చేసి కేసీఆర్ ని ఓడిస్తానని రఘునందన్ చెప్పడం వెనక వ్యూహం ఏంటన్నది ప్రశ్న.

కేసీఆర్ రాష్ట్రానికి ఇంత చేశాం అంత చేశాం అని చెప్పుకుంటున్న నేపథ్యంలో రఘునందన్ అవన్నీ అబద్ధాలే తాను గజ్వేల్ నుంచే పోటీ చేసి కేసీఆర్ ను ఓడిస్తానని అంటుండటం విశేషం.వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం ఆదేశాలు ఇస్తే తప్పక బరిలో నిలిచి గెలుస్తానని కూడా రఘునందన్ అంటున్నారు.అయితే ఈ వ్యాఖ్యల వెనక అర్థం ఏమున్నా కానీ వచ్చే ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చని అంటున్నారు.
కొన్ని చోట్ల లోపాయికారి ఒప్పందాలన్నవి కొందరి మధ్య కూడా ఉండి ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు.అందుకే రఘునందన్ అంత ధీమాగా ఈ వ్యాఖ్యలు చేసి షాక్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.