మరో మెగా హీరో సినిమాకు త్రివిక్రమ్ మాట సహాయం!

మెగా హీరోల్లో వైష్ణవ్ తేజ్ ఒకరు.ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల చేత శబాష్ అనిపించు కున్నాడు.

 Another Mega Hero Vaishnav Tej Into Trivikram Srinivas S Camp, Mega Hero, Vaishn-TeluguStop.com

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా ద్వారా వైష్ణవ్ తేజ్ తెలుగు సినిమా తెరకు పరిచయం అయ్యాడు.మొదటి సినిమా తోనే 50 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు.

దీంతో మెగా హీరోల లిష్టులో ఈయన క్రేజీ హీరోగా మారిపోయాడు.

ఫస్ట్ సినిమా హిట్ తోనే సూపర్ హిట్ అందుకోవడంతో ఈయనకు పెద్ద పెద్ద బ్యానర్ల నుండి వరుస అవకాశాలు వరించాయి.

ఇక ఉప్పెన సినిమా తర్వాత కొండపొలం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఈ సినిమాలో కూడా ఈయన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టు కున్నాడు.ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా సినిమాలో నటిస్తున్నాడు.

ఇక ఈయన నాలుగవ సినిమా పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది.

శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మిస్తున్నారు.ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాలో త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కూడా మరొక నిర్మాతగా ఉనాన్రు.

Telugu Kondapolam, Rangaranga, Uppena, Vaishnav Tej-Movie

ఈమె మొదటిసారిగా అధికారిక నిర్మాతగా మారుతున్నారు.దీంతో త్రివిక్రమ్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో హెల్ప్ చేయబోతున్నాడని తెలుస్తుంది.మహేష్ తో సినిమా పట్టాలెక్కడానికి ఇంకా సమయం ఉండడంతో త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో తన సహకారం అందించేందుకు సిద్ధం అయ్యాడని వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ భార్య త్వరలోనే సోలో నిర్మాతగా మారడమే కాకుండా సొంత బ్యానర్ కూడా స్టార్ట్ చేయనున్నారట.

వైష్ణవ్ తేజ్ సినిమాతో అడుగు పెట్టబోతున్న ఈమె నిర్మాతగా ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube