54 రూపాయలకే లీటర్ పెట్రోల్.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుతం పెరిగిన పెట్రోల్ ధరలతో సామాన్య ప్రజలు రోడ్డుపైకి వాహనాలతో రావాలంటనే భయపడిపోతున్నారు.మరీ అత్యవసరం అయితే తప్ప బండ్లను బటకు తీయట్లేరు.

 Litre Petrol Cost Is 54rs At Maharashtra Due To Raj Thackeray Birthday Details,-TeluguStop.com

కానీ ఈరోజు ఓ చోట్ల వందలాది మంది సామాన్య ప్రజలు వాహనాలతో వచ్చి పెట్రోల్ బంక్ ముందు వేచి చూస్తున్నారు.దీనంతటికీ కారణం అక్కడ లీటర్ పెట్రోల్ కేవలం 54 రూపాయలకు మాత్రమే ఇవ్వడం.

అయితే ఇంత తక్కువ ధరకు ఎందుకు ఇస్తున్నారు, ఇది ఎక్కడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మహారాష్ట్రలోని నవ నిర్మాణ్ సేవ పార్టీకి చెందిన రాజ్ ఠాక్రే 54వ పుట్టిన రోజు సందర్భంగా… ఆ పార్టీ కార్యకర్తలు వినూత్న ఆలోచన చేశారు.

తమ అభిమాన నాయకుడి పుట్టిన రోజును కేక్ లు కట్ చేయడం, అన్నదానాలు చేయడ, రక్త దానాలు చేయడం కంటే ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు.ఇంకేముంది ఔరంగాబాద్ లోని క్రాంతి చౌక్ పెట్రోల్ బంక్ లో రూ.54కే లీటర్ పెట్రోల్ అందిస్తామని తెలిపారు.

దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు, వాహన దారులంతా మంగళ వారం ఉదయం ఆరు గంటల నుంచే పెట్రోల్ బంక్ వద్ద గుమిగూడారు.

ఎలాగైనా సరే సగం ధరకే లీటర్ పెట్రోల్ ను దక్కించుకోవాలనుకున్నారు.దాని కోసం.ఎర్రటి ఎండలో గంటల తరబడి నిల్చున్నారు.చివరకు చాలా మంది లీటర్ పెట్రోల్ ను సొంతం చేసుకొని ఆనందంగా ఇంటికి వెనుదిరిగారు.

ప్రస్తుతం పెట్రోల్ ధర 100 రూపాయలకు పైగా కావడం… సగం ధరకే పెట్రోల్ ఇస్తామని చెప్పడంతో ఈ వార్త వైరల్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube