యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లికి సంబంధించిన శుభవార్త వినాలని ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రభాస్ రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా పెళ్లి చేసుకుంటానని అయితే ఎప్పుడో చెప్పలేనని అన్నారు.
ప్రభాస్ కుటుంబ సభ్యులు సైతం ప్రభాస్ పెళ్లికి సంబంధించి క్లారిటీ ఇవ్వడంలో తడబడుతున్నారు.అయితే ప్రభాస్ ఈ ఏడాదే పెళ్లి చేసుకోనున్నారని క్లారిటీ వచ్చింది.
మొగల్తూరు ప్రభాస్ అభిమాన సంఘం అధ్యక్షుడు ఒక ఇంటర్వ్యూలో ఈ ఏడాదే ప్రభాస్ పెళ్లి జరగనుందని చెబుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.ఇప్పటికే పెళ్లి కూతురును సైతం ఫిక్స్ చేశారని అతను వెల్లడించారు.
కృష్ణంరాజు ఫ్యామిలీకి బాగా పరిచయం ఉన్న కుటుంబం నుంచి పెళ్లికూతురును ఎంపిక చేశారని సమాచారం అందుతోంది.ప్రభాస్ ప్రస్తుతం వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.
కృష్ణంరాజు సైతం కొన్నిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటాడని తెలిపారు.ప్రభాస్ పెళ్లికి సంబంధించి ప్రచారంలోకి వస్తున్న వార్తలు అభిమానులకు ఒకింత సంతోషాన్ని కలగజేస్తున్నాయి.
ప్రభాస్ రేంజ్ కు తగిన అమ్మాయినే కుటుంబ సభ్యులు ఎంపిక చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ప్రభాస్ వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఆదిపురుష్, సలార్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఆదిపురుష్ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ లేదని సలార్ మాత్రం షూటింగ్ ఆలస్యమైతే రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలతో పాటు ప్రభాస్ పలు భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు.ప్రభాస్ తర్వాత సినిమాలతో పాన్ ఇండియా విజయాలను సొంతం చేసుకుని సత్తా చాటాలని అభిమానులు భావిస్తున్నారు.ప్రభాస్ కు ఇప్పటికే బాహుబలి సిరీస్ సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండగా తర్వాత సినిమాలు ప్రభాస్ ఇమేజ్ ను మరింత పెంచాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.