ఎక్స్ట్రా జబర్దస్త్ షో ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి కారణం ఎవరనే ప్రశ్నకు సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ పేర్లు సమాధానంగా వినిపించాయి.సుడిగాలి సుధీర్ టీమ్ స్కిట్లకు ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కుతున్న సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం ఈ షోకు సుధీర్, గెటప్ శ్రీను దూరమయ్యారు.సినిమాలలో వరుస ఆఫర్ల వల్ల గెటప్ శ్రీను దూరమైతే స్టార్ మా ఛానల్ లో ఆఫర్ వల్ల సుధీర్ ఈ షోకు దూరమయ్యారు.
అయితే తాజాగా రిలీజైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో సుడిగాలి సుధీర్ టీమ్ జర్నీ గురించి చూపించారు.రాకేష్ రామ్ ప్రసాద్ పాత్రను కెవ్వు కార్తీక్ సుధీర్ పాత్రను నూకరాజు గెటప్ శ్రీను పాత్రను వేశారు.
రాకేష్ శ్రీనుగాడికి పెళ్లైందని బస్సుల్లో తిరగలేకపోతున్నాడని అద్భుతమైన బైక్ కొనిద్దామని కెవ్వు కార్తీక్ కు చెప్పగా కెవ్వు కార్తీక్ సరేనని చెబుతాడు.నూకరాజుకు ఆ కాస్ట్లీ బైక్ చూడు గెటప్ శ్రీను అనే ఆర్టిస్ట్ దని చెప్పగా నూకరాజు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.
ఆ తర్వాత కెవ్వు కార్తీక్, నూకరాజు కలిసి రాకేష్ కు ఆండ్రాయిడ్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చి ఈ ఫోన్ ఆటో రామ్ ప్రసాద్ ఫోన్ అని చెబుతారు.ఆ తర్వాత నూకరాజు తాను ఒక అడుగు ముందుకు వేయాలని అనుకుంటున్నానని మూడు నెలలు జబర్దస్త్ కు రానని చెబుతాడు.ఆ తర్వాత కెవ్వు కార్తీక్ నేను కూడా ఆగిపోవాలని అనుకుంటున్నానని రాకేష్ తో చెబుతాడు.రాకేష్ వాళ్లు చేసిన స్కిట్ చూసి ఆటో రామ్ ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
రాకేష్ ఆటో రామ్ ప్రసాద్ ఈరోజు ఒంటరి వాడయ్యాడని ఎవరితో స్కిట్ చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.నాకు తెలియకుండానే ఒంటరి అయ్యానని భావన కలిగిందని ఆటో రామ్ ప్రసాద్ కూడా తెలిపారు.ఈ శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.